ETV Bharat / state

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు స్వస్తి?

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 11:48 AM IST

Updated : Jan 18, 2024, 3:56 PM IST

Sangameshwara Basaveshwara Projects : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు ప్రభుత్వం స్వస్తి పలికే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2021లో అనుమతులిచ్చి 4 వేల 500 కోట్లతో గత ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకానికి తెరదింపి ఆయకట్టుకు చిన్న చిన్న ఎత్తిపోతలతో సాగు నీరందిస్తే మరింత ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సర్కార్ భావిస్తోంది.

Sangameshwara Basaveshwara Projects
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రాష్ట్రప్రభుత్వం స్వస్తి ?

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రాష్ట్రప్రభుత్వం స్వస్తి ?

Sangameshwara Basaveshwara Projects : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు నుంచి నీటిని మళ్లించేందుకు చేపట్టనున్న సంగమేశ్వర(Sangameshwara), బసవేశ్వర ఎత్తిపోతల( Basaveshwara) పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 4,500 కోట్లతో ఆ పథకాల పనులు ఇంకా ప్రారంభంకానందున నిలిపివేసి ప్రత్యామ్నాయాలు మార్గాలను ఆలోచించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రెండుఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది.

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం - నీళ్లొచ్చేనా? పంట పండేనా?

Sangameshwara Lift Irrigation Scheme : 12 టీఎంసీల సామర్ధ్యంతో 2.19 లక్షల ఎకరాలకు నీరందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను 2,653 కోట్లతో చేపట్టేందుకు 2021 సెప్టెంబరులో అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతిచ్చింది. జహీరాబాద్‌, నారాయణ ఖేడ్‌, ఆందోల్‌ నియోజకవర్గాల్లో ఎత్తిపోతల ఆయకట్టు ఉంది. టెండర్లు పిలిచి 2,337 కోట్లకు గుత్తేదారుతో ఒప్పందం కుదిరింది. మూడు పంపుహౌస్‌లు నిర్మించే ఈ పథకానికి 140 మెగావాట్ల విద్యుత్తు అవసరం. 206.4 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ తవ్వాల్సి ఉంది.

Basaveshwara Lift Irrigation Scheme : 8 టీఎంసీల నీటి వినియోగంతో 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని 2021లో చేపట్టారు. టెండర్‌ పిలిచి 1,428 కోట్లకు గుత్తేదారుతో ఒప్పందం చేసుకొన్నారు. ఆ పథకానికి 70 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. రెండేళ్లలో పనులు పూర్తిచేసేలా ఒప్పందం చేసుకున్నా నిధుల సమస్యతో ప్రారంభం కాలేదు. నాబార్డు రుణంకోసం ప్రయత్నించగా మొత్తంకాకుండా 2 వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినా పథకాలు ముందుకు సాగలేదు.

Tummilla Lift Irrigation Project in Gadwal : తుమ్మెద తుమ్మిళ్లలో నీళ్లు లెవ్వు తుమ్మెద.. పంటలన్ని ఎండిపోయే తుమ్మెద

Congress Cancel Sangameshwara Lift Irrigation Scheme : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో టెండర్లు ఖరారు చేసి ప్రారంభం కాని పనులను పక్కనపెట్టే ప్రయత్నంలో భాగంగా ఆరెండు ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి ప్రత్యామ్నాయంగా ఈ ఆయకట్టుకు నీరందించేందుకు ఉన్నమార్గాలు ఆలోచించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఇటీవల మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రాజెక్టు ఇంజినీర్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై చర్చించినట్లు సమాచారం. ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పక్కనపెట్టి, చిన్న చిన్న ఎత్తిపోతలతో మరింత ఎక్కువగా ఆయకట్టుకు నీరందించేందుకు అవకాశం ఉందని ఆ విషయంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది.

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం ఆవిష్కృతం

Palamuru Rangareddy Lift Irrigation Project : 'పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు'

Last Updated : Jan 18, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.