ETV Bharat / state

ఇది పటాన్​చెరు వరి రైతుల గోస...!

author img

By

Published : Nov 11, 2019, 9:02 AM IST

ఇది పటాన్​చెరు వరి రైతుల గోస...!

రైతుల గోస అంతా ఇంతా కాదు.. పంట వేసినప్పటి నుంచి మొదలుపెడితే అమ్మే వరకు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు వరి రైతులది మరో సమస్య. పండిన పంటను కాపాడుకోడానికి సబ్సిడీపై తాడిపత్రులు ఇచ్చే ప్రభుత్వం ఈసారి ఇవ్వలేదు. ఫలితంగా పంట నూర్పిడి సమయంలో వర్షం వస్తే నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని వ్యయ ప్రయాసలకోర్చి పంట పండించడం ఒక ఎత్తయితే దాన్ని కాపాడుకోవడం రైతులకు మరో ఎత్తుగా మారింది. వరి కోత సమయం వచ్చినా తాడిపత్రిలు, సంచులు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు రైతులు.

పంట నూర్పిడి సమయంలో వర్షం వస్తే...

పటాన్​చెరు నియోజకవర్గంలో వరి పంట కోత దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో రైతులు పంటను కోయనున్నారు. అయితే రైతులకు వరి పంట నూర్పిడి సమయంలో వర్షం వస్తే ఇబ్బంది పడకుండా గతంలో వ్యవసాయ అధికారులు సబ్సిడీపై రైతులకు తాడిపత్రిలు ఇచ్చేవారు. ఈ ఏడాది అందుబాటులో లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంట నూర్పిడి అనంతరం ధాన్యం వర్షం బారినపడకుండా చూసుకునేందుకు తాడిపత్రి ఉంటే ఉపయోగంగా ఉండేదని రైతులు వాపోతున్నారు.

ఎకరాకు ఏడున్నర వేల నష్టం...

గతంలో మెదక్ జిల్లాలో ముందుగానే రైతులకు ధాన్యం సంచులు అందజేసేవారు. పంట నూర్పిడి ప్రదేశం నుంచి సొసైటీకి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు ఈ సంచులు ఉపయోగపడేవి. ప్రస్తుతం సంచులు లేకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు నూర్పిడి ప్రదేశం నుంచే బరువును లెక్కిస్తూ తక్కువ ధరకు కట్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీనివల్ల దాదాపు ఎకరాకు రూ.7,500 నష్ట పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లామని రైతులు చెబుతున్నారు.

మేం నిబంధనలు పాటిస్తున్నాం...

రైతులకు సంచులు ఇచ్చే విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. సొసైటీకి ధాన్యం తెచ్చిన తరువాత తేమ పరిశీలించి అందజేస్తున్నామని చెబుతున్నారు. ఈసారి కచ్చితంగా నిబంధనలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు.

ఇది పటాన్​చెరు వరి రైతుల గోస...!

ఇవీ చూడండి: మక్కలను మద్దతు ధరకు కొనాలంటూ రైతుల ఆందోళన

Intro:hyd_tg_05_04_jk_problems_of_paddy_farmers_pkg_bytes1,2_TS10056
Lsnraju:93944450162
యాంకర్:


Body:note స్క్రిప్ట్ ముందే వచ్చింది గమనించగలరు


Conclusion:బైట్స్ పేర్లు ముందే పంపించా గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.