ETV Bharat / state

సంగారెడ్డిలో సేంద్రీయ కూరగాయల మార్కెట్​ ప్రారంభం

author img

By

Published : Apr 27, 2020, 11:47 PM IST

ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సంగారెడ్డి కలెక్టరేట్​ ఆవరణలో సేంద్రీయ కూరగాయల మార్కెట్​ను ప్రారంభించారు. ప్రతి సోమవారం ఈ మార్కెట్​ను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యానవన జిల్లా అధికారి సునీత తెలిపారు.

సేంద్రీయ కూరగాయల మార్కెట్​
సేంద్రీయ కూరగాయల మార్కెట్​

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఆవరణలో సేంద్రీయ కూరగాయలు, పండ్ల మార్కెట్​ను డీఆర్​వో రాధికా రమణి ప్రారంభించారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ మార్కెట్​ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్​లో ఈ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునీత చెప్పారు. 24 రకాల కూరగాయలను రూ. 500కి, 7 రకాల పండ్లను రూ.350కి అమ్ముతున్నారన్నారు. హోమ్ డెలివరీ సదుపాయం, మొబైల్ నుంచి అడ్వాన్​ బుకింగ్​ చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఇదీ చూడండి: ఉద్యమ ప్రస్థానం: గుండె గుండెలో గులాబీ లిఖితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.