ETV Bharat / state

Minister KTR in sangareddy: 'సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​దే'

author img

By

Published : Dec 16, 2021, 4:49 PM IST

Minister KTR in sangareddy: ఇల్లు లేని పేదలు ఎక్కెడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఉంటే వారికి ఆ స్థలాలను రెగ్యులరైజ్​ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​దేనని ఆయన అన్నారు. పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్రంలోని పురపాలికలకు రూ.3041 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

Minister KTR Speech: 'సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​దే'
Minister KTR Speech: 'సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​దే'

Minister KTR in sangareddy: ప్రతి పట్టణంలో వెజ్​-నాన్​వెజ్​ మార్కెట్​ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. సంగారెడ్డి పట్టణంలో 6కోట్ల 70లక్షలు వ్యయంతో వెజ్- నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. దీంతో పాటు ఆఖరి మజిలీ వాహనాలను ప్రారంభించారు. పట్టణ ప్రగతి, పల్లెప్రగతి ద్వారా ఎన్నో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేస్తోందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే అడగగానే మెడికల్​ కాలేజీ స్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్​ అంగీకరించారని కేటీఆర్​ పేర్కొన్నారు.

సఫాయి కార్మికుల ఆవశ్యకతను గుర్చించాం..

ఇల్లు లేని పేదలు ఎక్కెడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఉంటే వారికి ఆ స్థలాలను రెగ్యులరైజ్​ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. గతంలో పురపాలికల్లో సఫాయి కార్మికులకు మూడు నెలల వరకు కూడా జీతాలు వచ్చేవి కావని.. ప్రస్తుతం సఫాయి కార్మికుల ఆవశ్యకతను సీఎం కేసీఆర్​ గుర్తించారన్నారు. 'సఫాయి అన్న.. నీకు సలాం అన్న' అని అన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి సలాం కొట్టడమే కాకుండా వారికి జీతాలు పెంచి ప్రతి నెల కూడా అందిస్తున్నారని మంత్రి అన్నారు.

సంగారెడ్డి వరకు మెట్రో కష్టం...

minister ktr on pattana pragathi: పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్రంలోని పురపాలికలకు రూ.3041 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిందని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కేంద్రంగా ఉన్న సంగారెడ్డిలో కనీసం మంచి కూరగాయల మార్కెట్ లేదని.. దానిని గుర్తించి సమీకృత మార్కెట్​ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. రాష్ట్రంలోని 142 పురపాలికల్లో 500 కోట్ల రూపాయలతో ఆధునిక వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాకే రైతుబంధు, రైతుబీమా, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి పథకాలు వచ్చాయన్నారు. మెట్రో రైలును సంగారెడ్డి వరకు పొడిగించాలని స్థానిక ఎమ్మెల్యే జంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే మెట్రో నష్టాల్లో ఉందని.. సంగారెడ్డి వరకు సాధ్యం కాదని మంత్రి కేటీఆర్​ అన్నారు.

గతంలో ఆ పరిస్థితి ఉండేది..

గతంలో సఫాయి కార్మికులకు మూణ్నాలుగు నెలల పాటు జీతాలు రాని పరిస్థితి ఉండేది. కేసీఆర్​ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద నిధులు విడుదల చేశారు. గతంలో జీతాలు వచ్చినా తక్కువగానే వచ్చేవి. 'సఫాయి అన్న.. నీకు సలాం అన్న' అనడమే కాకుండా.. వారికి జీతాలు పెంచిన ఘనత కేసీఆర్​ గారిదే. -మంత్రి కేటీఆర్​

'సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​దే'

ఇదీ చదవండి:

KTR on Warangal Tech Center: 'జెన్‌పాక్ట్ రాకతో వరంగల్‌ ఐటీ మరింత బలోపేతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.