ETV Bharat / state

విద్యారంగానికి అన్ని విధాల కృషి: హరీశ్​ రావు

author img

By

Published : Feb 12, 2021, 3:34 PM IST

minister harish opened new school building in karsagutti village in sangareddy district
బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్​ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు పర్యటించారు. నాగల్​ గిద్ద మండలం కరస్​ గుత్తిలో నూతనంగా నిర్మించిన బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు.

విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నాగిల్ గిద్ద మండలం కరస్​ గుత్తిలో రూ.4.28 కోట్లతో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. స్కూళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సరదాగా మంత్రి ప్రశ్నించారు. నారాయణఖేడ్​ నియోజకవర్గంలో నాలుగు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్​, ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి, కలెక్టర్​ హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.