BANDI SANJAY: 'జనాభా నియంత్రణ చట్టం తెస్తాం.. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటాం'

author img

By

Published : Sep 8, 2021, 5:09 AM IST

Updated : Sep 8, 2021, 5:14 AM IST

BANDI SANJAY

బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదు.. కేసీఆర్ మీద దండయాత్ర అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజశ్వీ సూర్యా పేర్కొన్నారు. సంజయ్ పాదయాత్రలో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తెచ్చే వరకు తాము విశ్రమించమని ఆయన స్పష్టం చేశారు. తాము 2023లో అధికారంలోకి రాగానే ఉత్తర్‌ప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం తేవడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

పాదయాత్రలో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభ

తాము 2023లో అధికారంలోకి రాగానే ఉత్తర్‌ప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం తేవడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అనేది భాజపా విధానమన్నారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆ రిజర్వేషన్లను పెంచి తెరాస ప్రభుత్వం ఎంఐఎం నేతలకు లబ్ధి చేకూర్చాలని చూస్తోందని తాము కచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణం నుంచి మొదలై సంగారెడ్డి పట్టణానికి చేరింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన సభకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తన పాదయాత్రలో చాలా మంది సమస్యలు చెప్పుకుంటున్నారని వివరించారు. సాగునీరు కాదు కదా... కనీసం తమకు తాగునీరు కూడా రావడం లేదని చెబుతున్నారన్నారు. మరి సాగుకు నీరు రాకుండా ప్రాజెక్టుల పేరిట ఖర్చు చేసిన ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రతి పేదకూ ఇల్లు కట్టించేలా ఎన్ని లక్షల ఇళ్లయినా కేంద్రం నుంచి మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వాస్తవాలు మాట్లాడే అధికారులకు ఈ ప్రభుత్వంలో వేధింపులు తప్పడం లేదన్నారు.

తెరాస ఝూటా పార్టీ: తేజస్వి సూర్య

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి పట్టణానికి చేరుకుంది. 11రోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూర్ పశ్చిమ ఎంపీ తేజశ్వీ సూర్య ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. తన ప్రసంగంలో కొన్ని తెలుగు వాఖ్యాలు మాట్లాడి కార్యకర్తలను ఆకట్టుకున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్​లో, తెరాస శ్రేణుల్లో భయం పట్టుకుందని ఆరోపించారు. కేసీఆర్​ది అబద్ధాల ప్రభుత్వమని సూర్యా ఆరోపించారు. ఎన్నికల ముందు నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కేసీఆర్.. ఎన్నికల తర్వాత కనీళ్లు, నిరుద్యోగుల ఆత్మహత్యలే మిగిల్చాడని విమర్శించారు. ధర్మానికి.. అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని.. ఈ ధర్మ యుద్ధంలో భాజపా విజయం సాధిస్తుందని సూర్య స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తోందని.. తెరాస గుండాయిజానికి తమ కార్యకర్తలు భయపడరని.. పోరాటం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

  • ఈ రోజు బండి సంజయ్ పాదయాత్ర సంగారెడ్డి నుంచి సుల్తాన్ పూర్ వరకు సాగనుంది.

ఇవీ చూడండి: 'పోడు రైతులకు హక్కులు కల్పించే వరకూ మా పోరాటం ఆగదు': అఖిలపక్షం

Last Updated :Sep 8, 2021, 5:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.