అరణ్య.... ఇదొక ప్రకృతి బడి

author img

By

Published : Jun 22, 2019, 5:58 AM IST

జలం నుంచి జీవం వరకు అన్నీ మనిషికి అందిస్తుంది ప్రకృతి... కానీ దాన్ని ఎలా వినియోగించుకుంటున్నారన్నదే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది... నిజానికి ప్రకృతిని మనిషి దోచుకుంటున్నాడు. ఇది అన్యాయం... ఒక్కమాటలో చెప్పాలంటే అనైతిక ప్రవృత్తి. దానికి అత్యవసరంగా అడ్డుకట్ట వేయాలంటోంది అరణ్య. దీనికోసం అడవిలోకి రమ్మంటోంది... ప్రకృతి గుండె చప్పుడు వినమంటుంది... ఎలా వినాలో మేం నేర్పిస్తాం రా రమ్మంటోంది.

అరణ్య.... ఇదొక ప్రకృతి బడి

జహీరాబాద్​లోని గజ్వేల్​ రిజర్వ్​ ఫారెస్ట్​ని ఆనుకుని అరణ్య అగ్రికల్చర్​ ఆల్టర్నేటివ్స్​ సంస్థ పదెకరాల్లో విస్తరించి ఉంటుంది. అందులో నర్సన్న కొప్పుల, పద్మ దంపతులు పెర్మాకల్చర్​కి సంబంధించిన పాఠాలు చెబుతారు. ఇది ఒక ప్రకృతి బడి. రసాయనాలకు, ప్లాస్టిక్​కి దూరంగా ఉండే నేలపై... అంతటా పచ్చగా పరుచుకున్న వివిధ రకాల వృక్షాలు, స్వేచ్ఛగా అల్లుకున్న పొదలు, తృణధాన్యాల పంటలు, నేలసారాన్ని పెంచే నేస్తాలుంటాయి. మండే ఎండల్లో కూడా నిండుగా నీళ్లతో కనిపించే బావులు, పశువులు కనిపిస్తాయి. పెర్మాకల్చర్‌తో ఒనగూరే లాభాలు వివరించడానికి ‘అరణ్య’ఓ నమూనా!

శాశ్వతసాగు... పర్మాకల్చర్​:

పర్మనెంట్‌, అగ్రికల్చర్‌ పదాల నుంచి వచ్చిన మాటే పర్మాకల్చర్‌. దీన్నే శాశ్వత సాగు విధానం అంటున్నారు. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రకృతితో చెలిమి చేస్తూ చేసే వ్యవసాయ విధానం. పాడిపంటలు అని పేరుకే అంటున్నాం కానీ ఇప్పటి రైతులు చాలామంది పాడికి దూరమయ్యారు. విత్తనాల కోసం, మందుల కోసం వేరొకరిపై ఆధారపడుతున్నారు. ప్రకృతి వైవిధ్యం కోల్పోడానికి కారణమవుతున్నారు. నష్టాల్లో కూరుకుపోతున్నారు. దీనికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమమే పెర్మాకల్చర్‌.

సేంద్రియ అరణ్య:

వ్యవసాయ రంగంలో చక్కని అనుభవం ఉండి, ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న నర్సన్న 1989లో ఆస్ట్రేలియా వెళ్లి పర్మాకల్చర్‌ని అభ్యసించారు. అందరినీ ఆ విధానంవైపు మళ్లించాలన్నది ఆయన లక్ష్యం. జహీరాబాద్‌లోని బిడకన్నె ప్రాంతంలో 1999లో పదెకరాల బీడు భూమిని ఎన్నుకుని పర్మా విధానంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అదే ప్రస్తుతం సేంద్రియ ‘అరణ్య’గా మారింది. ఆ అనుభవాలే కొన్ని వేల మందికి పాఠాలయ్యాయి.

పెర్మాకల్చర్​ కోసం భూసంరక్షణ, ప్రజల సంరక్షణ, న్యాయమైన వాటా విలువలను పాటించాలని నిర్ణయించారు.

ఆ 5 సూత్రాలను అనుసరించాలి

  1. ప్రకృతిని గమనించు. అది మనకు అనేక శక్తులని ఇస్తుంది. వాటిని ఒడిసిపట్టాలి...
  2. తక్కువ పనితో ఎక్కువ ఫలితాలు. ఒక మొక్కకు నీరు పోస్తుంటే దాని వల్ల ఇతర జీవావరణ వ్యవస్థలకూ నీరు పోసినట్టే...
  3. వృథా కానివ్వద్దు. ఏది ఎంత అవసరమో అంతే తీసుకోవడం వల్ల వనరులను కాపాడినట్లే...
  4. వైవిధ్యమే మనకు రక్షణ... పంట నుంచి ప్రతి వినియోగం వరకు సృజనాత్మకత చూపాలి...
  5. ముందు నువ్వు ఆచరించు. తర్వాత నీ కుటుంబాన్ని ప్రోత్సహించు. ఆ తర్వాత సమాజానికి తెలియపరుచు...

అరెకరం భూమి ఉన్నా చాలు మనకి కావాల్సిన కాయగూరలు, ధాన్యాలు, పప్పులు, పాడిని పొందొచ్చు. ఆహారభద్రత, ఇంధన భద్రత పొందవచ్చంటున్నారు నర్సన్న దంపతులు. వీరి ఆలోచనతో ఉత్తేజితులైన కొందరు ప్రకృతి ప్రేమికులు కూడా... తమ భూమిని కూడా సేంద్రియమయం చేసుకుంటూ పర్మాకల్చర్‌ విధానంలోకి అడుగు పెడతామంటున్నారు.

ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి విడుదలైన జీవధార

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి బాలుడు నిండా మునిగిన వైనం

ఒకటి తనది మరొకటి వేరే విద్యార్థి మూల్యాంకన పత్రం పంపినట్లు చూపిస్తున్న రాఘవేంద్ర సెకండరీ బోర్డు లో నిండా నిర్లక్ష్యం

ఒకరి జవాబు పత్రం మరొకరికి పంపిన వైనం

ఇంటర్ ఫలితాల్లో ని తప్పిదాలతో విద్యార్థులు ఎదుర్కొన్న బాధలు మరవకముందే 10వ తరగతి విద్యార్థి అలాంటి సమస్య ఎదురైంది మూల్యాంకన పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థికి జవాబు పత్రాలు జత చేసి పంపించడం సెకండరీ బోర్డు నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది పోస్ట్ ద్వారా బోర్డు నుంచి వచ్చిన కవర్ తెరిచి చూసిన సదరు విద్యార్థి కి మరొకరి జవాబు పత్రం కనిపించగా కంగుతిన్నారు ఇది కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గరిమెళ్ళ రాఘవేంద్ర విద్యార్థి ఎదుర్కొన్న సమస్య సదరు విద్యార్థి స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి హాల్ టికెట్ సంఖ్య 1 9 0 2 1 0 2 3 5 6 చదివారు విడుదలైన పదో తరగతి ఫలితాలు తెలుగులో బీ2గ్రేడు జి పీ ఏ 07 సెకండ్ లాంగ్వేజ్ బి2 గ్రేడ్ జి పి ఏ 07 ఆంగ్లంలో బి1 గ్రేడ్ జి పీ ఏ08 గణితంలో ఎ2 గ్రేడ్ జి పి ఎ09, సాంఘిక శాస్త్రం లో బి2 గ్రేడ్ జి పి ఏ07 పాయింట్లు సాధించగా సైన్స్లో లో ఈ గ్రేడ్ డ్ జి పి ఎ nil చూపుతూ ఫెయిలయినట్లు ప్రకటించారు దీంతో సదరు విద్యార్థి ఇ తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఇది గమనించిన తండ్రి గరిమెళ్ళ ప్రసాద్ మే 17న సైన్సు మూల్యాంకన పత్రాల కోసం అంతర్జాలంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు దరఖాస్తు చేశారు బోర్డు నుంచి జవాబు పత్రాలను పోస్టులో పంపించారు అవి గురువారం సదరు విద్యార్థి ఇంటికి చేరడంతో కవర్ తెరిచి చూశారు సైన్స్ మొదటి జవాబు పత్రం లో 12 మార్కులు వచ్చాయి రెండో జవాబు పత్రం మాత్రం రాఘవేంద్రది కాకుండా అంకిత అనే వేరే విద్యార్థి ఇ జవాబు పత్రం పంపించారు దీనిని చూసిన సదరు విద్యార్థి ఇ విస్తుపోయారు తనది కాకుండా మరో విద్యార్థిని జవాబు పత్రం పంపడంతో తనకు ఎన్ని మార్కులు వచ్చాయో అని అది ఎలా తెలిసేది అని వాపోయారు తాను రాసిన జవాబు పత్రాన్ని పంపించేలా విద్యాశాఖ అధికారులను చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బోర్డు నుంచి వచ్చిన పత్రాలను జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు వద్దకు తీసుకెళ్లి చూపించినట్లు విద్యార్థి తండ్రి పేర్కొన్నారు

జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్


Body:tg_adb_26_21_secondary_board_lo_ninda_nirlaksham_avb_c10


Conclusion:మొదటి bite గరిమెళ్ళ ప్రసాద్ విద్యార్థి తండ్రి
రెండవ bite గరిమెళ్ళ రాఘవేంద్ర పదో తరగతి విద్యార్థి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.