Gaddiannaram Fruit Market : గడ్డి అన్నారం మార్కెట్​ తరలింపుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

author img

By

Published : Nov 22, 2021, 10:50 PM IST

telangana high court

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది (Gaddiannaram Fruit Market). ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

Gaddiannaram Fruit Market :గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపు విషయమై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది (telangana high court). ధర్మాసనం నియమించిన అడ్వొకేట్ కమిషనర్ కె.వినయ్ కుమార్ నివేదిక సమర్పించారు. బాటసింగారంలో ప్రభుత్వం వసతులను కల్పించినప్పటికీ... పూర్తి స్థాయి వ్యాపారాలు చేసేస్థాయిలో లేవని అడ్వొకేట్ కమిషనర్ పేర్కొన్నారు. గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో ఆస్పత్రి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయమేనన్నారు. పేదల కోసం ఆస్పత్రి నిర్మించతలపెట్టిన ప్రభుత్వం... మార్కెట్ తరలింపునకు పూర్తిస్థాయి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని.. బాటసింగారం (batasingaram market) మార్కెట్​లో వసతులు ఎందుకు కల్పించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

ఇప్పటికే చాలా వసతులు కల్పించామని.. పిటిషనర్లు కోరుతున్న మరిన్ని సదుపాయాలను ఒకటి, రెండు రోజుల్లో సమకూరుస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. కోల్డ్ స్టోరేజీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విశ్రాంత గదుల వంటి సగం సదుపాయాలు కల్పించినా.. బాటసింగారం వెళ్లేందుకు వ్యాపారులు, ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదీ చూడండి: Gaddiannaram Fruit Market: 'కొహెడ వెళ్లేందుకు సిద్ధం... మధ్యలో ఎక్కడికీ వెళ్లం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.