ETV Bharat / state

'ప్రశ్నించినందుకు రేవంత్​రెడ్డి అక్రమ అరెస్టు'

author img

By

Published : Mar 5, 2020, 10:36 PM IST

Updated : Mar 5, 2020, 11:04 PM IST

ఫామ్ హౌస్​పై అనుమతిలేకుండా డ్రోన్ కెమెరా వినియోగించారన్న ఆరోపణలపై ఉప్పర్​​పల్లి కోర్టు మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించగా.. కాంగ్రెస్​ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Revanth Reddy arrested for questioning in telangana
'ప్రశ్నించినందుకు రేవంత్​రెడ్డి అక్రమ అరెస్టు'

ఫామ్ హౌస్​పై అనుమతిలేకుండా డ్రోన్ కెమెరా వినియోగించారన్న ఆరోపణలపై ఉప్పర్​​పల్లి కోర్టు మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని భారీ పోలీసు బందోబస్తు మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రేవంత్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఫామ్​ హౌస్​ 33 జీవోకు వ్యతిరేకంగా కట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఆస్తుల గురించి ప్రశ్నించినందుకు రేవంత్​రెడ్డిని అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. వాస్తవాన్ని బయట పెట్టినందుకు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

'ప్రశ్నించినందుకు రేవంత్​రెడ్డి అక్రమ అరెస్టు'

ఇదీ చూడండి : మరో పోరాటానికి సిద్ధం కండి

Last Updated : Mar 5, 2020, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.