ETV Bharat / state

వనస్థలిపురం జయదుర్గ ఆలయంలో ఘనంగా మహా చండీయాగం

author img

By

Published : Oct 3, 2022, 5:52 PM IST

Maha Chandi Yagam at Vanasthalipuram: రాష్ట్రంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు. వనస్థలిపురంలోని గణేష్ దేవాలయం ఆవరణలో ఉన్న జయ దుర్గా దేవి ఆలయంలో 25వ శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు మహా చండీయాగంను ఘనంగా నిర్వహించారు.

Vanasthalipuram Ganesh Temple
Vanasthalipuram Ganesh Temple

Maha Chandi Yagam at Vanasthalipuram: రాష్ట్రంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా​ వనస్థలిపురం గణేష్ దేవాలయం ఆవరణలో ఉన్న జయదుర్గా దేవి ఆలయంలో మహా చండీయాగంను ఘనంగా నిర్వహించారు. దుర్గాష్టమిని పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు.

అనంతరం చండీ యాగంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రధాన అర్చకులు బాలాజీ గురుకల్ తెలిపారు. భక్తులు కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తుందన్న ప్రగాఢ నమ్మకంతో పెద్ద ఎత్తున మహిళలు ఈయాగంలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.

వనస్థలిపురం జయదుర్గ ఆలయంలో ఘనంగా మహా చండీయాగం

ఇవీ చదవండి: Special Bathukamma: 12 అడుగుల భారీ బతుకమ్మ సద్దుల స్పెషల్

నగారా మోగింది.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమైన మునుగోడు పోరు

అమ్మో.. ఎంత పెద్ద పన్ను.. ప్రపంచంలోనే పొడవైనది ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.