ETV Bharat / state

Sirpurkar Commission: శంషాబాద్ డీసీపీని విచారించిన జస్టిస్ సిర్పుర్కర్‌ కమిషన్

author img

By

Published : Oct 20, 2021, 9:41 PM IST

దిశ హత్యాచార కేసులో(Disha rape and murder case) జస్టిస్ సిర్పుర్కర్‌ కమిషన్ (Justice Sirpurkar Commission) విచారణ చేపట్టింది. ఇదివరకే రాచకొండ సీపీ మహేశ్​ భగవత్, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్​లను విచారించిన కమిషన్... తాజాగా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​రెడ్డిని విచారించింది.

Sirpurkar Commission
జస్టిస్ సిర్పుర్కర్‌ కమిషన్

దిశ నిందితుల ఎన్​కౌంటర్​కు (Justice Sirpurkar Commission) సంబంధించి మీడియా ప్రతినిధుల ఒత్తిడి మేరకే సంఘటనా స్థలానికి సమీపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి (Shanshabad Dcp Praksh Reddy), సిర్పూర్కర్ కమిషన్​కు వివరించారు. ఎన్​కౌంటర్​కు సంబంధించిన వివరాలను షాద్​నగర్ సీఐ, ఏసీపీ నుంచి తెలుసుకొని... సైబరాబాద్ సీపీకి వివరించానని... ఆ వివరాలనే విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించారని ప్రకాశ్​రెడ్డి తెలిపారు. నిందితులకు కూడా కొన్ని హక్కులుంటాయని... వాళ్ల ఫొటోలు మీడియాలో రావొద్దని తెలియదా అని సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించగా... షాద్​నగర్ పీఎస్​లో ఉన్న నలుగురు దిశ నిందితుల ఫొటోలను విలేకరులు తీసుకున్నారని ప్రకాశ్​రెడ్డి తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది విరుద్ధం కదా అని సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించగా... ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటానని శంషాబాద్ డీసీపీ తెలిపారు. అదనపు డీజీ సజ్జనార్, సిర్పూర్కర్ కమిషన్​కు చెప్పిన సమాధానాల ఆధారంగా ప్రకాశ్​రెడ్డిని ప్రశ్నించారు. నేటితో ప్రకాశ్​రెడ్డి విచారణ ముగిసింది. రేపటి నుంచి ఏసీపీ సురేందర్​ను విచారించనున్నారు. ఎన్​కౌంటర్ జరిగిన సమయంలో సురేందర్ షాద్​నగర్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు.

ఇదివరకే విచారణ...

దిశ హత్యాచార కేసులో(Disha rape and murder case) జస్టిస్ సిర్పుర్కర్‌ కమిషన్ (Justice Sirpurkar Commission) విచారణ చేపట్టింది. పలువురు సాక్షులను కమిషన్ (Disha Case Details In Telugu) ప్రశ్నిస్తోంది. ఇప్పటికే సిట్ ఛైర్మన్ మహేశ్​ భగవత్‌ను ప్రశ్నించిన కమిషన్.. మరోసారి ఆయనను విచారించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఎన్‌కౌంటర్(hyderabad disha encounter case) జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్​ను(disha encounter sajjanar) విచారించింది. ఇందులో భాగంగా దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించిన కమిషన్... ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆరా తీసింది.

అపూర్వారావును ప్రశ్నించిన కమిషన్

‘దిశ’ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలో పాల్గొన్న పోలీసులు వినియోగించిన తూటాల లెక్క తేల్చేందుకు సంబంధిత ఠాణాల్లోని ఆయుధాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారా? అని వనపర్తి ఎస్పీ అపూర్వారావును సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇదివరకే ప్రశ్నించింది. తనిఖీ చేయలేదని ఆమె బదులిచ్చారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఏర్పాటైన సిట్‌కు సంబంధించి కేస్‌ డైరీ రాసిన అపూర్వారావును కమిషన్‌ ఇప్పటికే విచారించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.