ETV Bharat / state

ఈ సదుపాయాలు కాపాడుకోవాలా వద్దా, ఆలోచించుకోవాలని ప్రజలకు కేసీఆర్‌ సూచన

author img

By

Published : Aug 25, 2022, 5:14 PM IST

Updated : Aug 26, 2022, 3:24 PM IST

CM KCR Integrated Rangareddy District Offices Complex బంగారు పంటలు పండే తెలంగాణ కావాలా, మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా, ప్రజలే తేల్చుకోమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనం, జిల్లా తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. కొంగర్‌కలాన్‌లో 44 ఎకరాల్లో ఆధునిక సదుపాయలతో రూ.58 కోట్లతో కొత్త కలెక్టరేట్​ను నిర్మించారు.

CM KCR
CM KCR

ఈ సదుపాయాలు కాపాడుకోవాలా వద్దా, ఆలోచించుకోవాలని ప్రజలకు కేసీఆర్‌ సూచన

CM KCR Integrated Rangareddy District Offices Complex తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అన్నారని గుర్తు చేశారు. విద్యుత్‌, సాగునీరు, తాగునీరు ఇవ్వని వాళ్లే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. 15ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు. ఏ ప్రాంతంలో మేధావులు, విద్యాధికులు, యువత ఏమరపాటుగా ఉంటారో అక్కడ చాలా బాధలు అనుభవించాల్సి వస్తుందని వివరించారు. అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ అని చెప్పారు.

చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని ఉద్ఘాటించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు. దేశంలోని ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతులు పండించే ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మరోసారి చెప్పారు. రైతులు అప్పులు తీసుకునే అవసరం లేకుండా రైతు బంధు ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నామన్నారు.

తెలంగాణ కోసం ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో రంగారెడ్డి జిల్లాలో అనేక ర‌కాల త‌ప్పుడు ప్ర‌చారాలు చేశారు. భూములు ధ‌ర‌లు ప‌డిపోతాయ‌ని, రాష్ట్రం వ‌స్తే లాభం ఉండ‌ద‌ని చెప్పారు. మన‌కు క‌రెంట్, మంచినీరు ఇవ్వ‌ని వారు మ‌న‌ల్ని గోల్ మాల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌ట్టుద‌ల‌తో 14 ఏళ్లు పోరాడితే చాలా త్యాగాల త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కొత్త జిల్లాల‌ను సాధించుకున్నాం. చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. - కేసీఆర్, ముఖ్యమంత్రి

నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇలాంటి సదుపాయాలు వస్తాయని రైతులు కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు కాపాడుకోవాలా? వద్దా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 26, 2022, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.