'ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గణేశ్ నిమజ్జనాలు చేపట్టాలి'

author img

By

Published : Sep 16, 2021, 3:52 PM IST

The Bhagyanagar Ganesh Festival Committee

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పనామా కూడలిలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ధర్నా చేపట్టింది. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గణేశ్ నిమజ్జనాలు చేపట్టాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నిరసనతో కాసేపు జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గణేశ్ నిమజ్జనాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పనామా కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ధర్నాతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వనస్థలిపురం పోలీసుస్టేషన్ కి తరలించారు.

కేబినెట్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఈ ఆర్డినెన్స్ పై చర్చించి యథావిధిగా నిమజ్జనాలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నగరంలో పెట్టిన లక్ష గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అలాగే ఉంచి.. ఆ స్థలాల్లో గుళ్లు కడతామని హెచ్చరించారు.

జాతీయ రహదారిపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ధర్నా

ఇదీ చదవండి: Ts Cabinet: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.