ETV Bharat / state

గాంధీ వైద్యురాలిని అడ్డుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు

author img

By

Published : Apr 25, 2020, 3:47 PM IST

కరోనా వ్యాప్తి భయాందోళనలో గాంధీ ఆసుపత్రి వైద్యురాలిని ఓ అపార్ట్‌మెంట్‌ వాసులు అడ్డుకున్నారు. ఆవేదన చెందిన ఆ వైద్యురాలు వనస్థలిపురం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆ విషయంపై మంత్రి ఈటలకు సైతం ఫిర్యాదు చేశారు.

apartment dwellers who blocked the Gandhi doctor at mansoorabad rangareddy
గాంధీ వైద్యురాలిని అడ్డుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు

సోదరుడి ఇంటికి వచ్చిన ఓ వైద్యురాలిని అపార్ట్‌మెంట్‌ వాసులు అడ్డుకోవడం వల్ల పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యురాలు గురువారం మన్సూరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సోదరుడి ఇంటికి వచ్చారు. అపార్టుమెంటు వాసులు రావద్దని అభ్యంతరం చెప్పగా వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆమె శుక్రవారం వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా అపార్టుమెంటులోని పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ విషయంపై సదరు వైద్యురాలు శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి : మనవరాలితో కలిసి టేబుల్​ టెన్నిస్​ ఆడిన మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.