ETV Bharat / state

advocate protection act: 'న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి'

author img

By

Published : Sep 29, 2021, 6:05 PM IST

advocate protection act
advocate protection act

న్యాయవాదులపై దాడి అప్రజాస్వామికమని రంగారెడ్డి కోర్టు బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు భాస్కర్​రెడ్డి తెలిపారు. తక్షణం అడ్వొకేట్ల రక్షణ చట్టం తీసుకురావాలని (advocates demands for protection act) ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

న్యాయవాదులపై దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని బార్​ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్​రెడ్డి అన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో.. విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని (advocate protection act) నినాదాలు చేశారు. ఇటీవల న్యాయవాదులపై దాడులు ఎక్కువయ్యాయని.. భాస్కర్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఉంటూ న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులకు రక్షణ చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని (advocates demands for protection act) డిమాండ్ చేశారు.

'న్యాయవాది బాలాజీపై దాడి జరిగింది. అందుకే బార్​ అసోసియేషన్​ తరఫున విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నాం. అడ్వొకేట్లపై ఈమధ్య దాడులు పెరిగాయి. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.'

- భాస్కర్​రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టు బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు

ఇదీచూడండి: బాణసంచాలో రసాయనాల వినియోగంపై సుప్రీం సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.