minister ktr: 'వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవటం తప్పా'

author img

By

Published : May 10, 2022, 7:50 PM IST

ktr

minister ktr: పొలం మధ్యలో ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రి అయిపోతారా అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రతిపక్షాలను నిలదీశారు. కేసీఆర్‌ పుట్టిందే ఉన్నత కుటుంబంలోనని.. రైతుల కష్టాలు తెలుసన్నారు . అందుకే 6 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. 60 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీలు అన్నదాతల కోసం ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు.

minister ktr: రైతు కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినందునే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో పర్యటించారు. కోనాపూర్‌లో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

సీసీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వందల ఎకరాల భూములున్న కుటుంబంలో పుట్టిన కేసీఆర్​ని.. ఇవాళ కొందరు ఫాంహౌజ్ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవటం తప్పా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా తన నానమ్మ, అమ్మమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో పాఠశాలను నిర్మించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా తన పూర్వీకుల గురించి వారితో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేటలో రెండు పడకగదుల ఇళ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్లను అందచేశారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. త్వరలోనే కొత్త పింఛన్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌నగర్‌లో లబ్ధిదారులతో కలిసి మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు.

"కేసీఆర్ పుట్టినప్పుడే వందల ఎకరాల భూమి ఉంది. ఆయనకు కొత్తగా ఆస్తులు అక్కర్లేదు. ఒకరు మాట్లాడుతారు ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రి అని అంటారు. పొలం మధ్యలో ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రి అయిపోతారా. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కేసీఆర్ వల్లే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున అమలవుతున్నాయి. 60 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశారు. అందుకే 6 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఈ జిల్లా నుంచి కొందరు మంత్రులుగా పనిచేశారు. ఏం పనులు చేసింది లేదు. -కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి

వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవటం తప్పా

ఇదీ చదవండి: HARISH RAO: 'తెరాసనే ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష'

పంచాయతీ భవనాన్ని కూల్చి.. శిథిలాలు అమ్మేసుకున్న గ్రామపెద్ద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.