ETV Bharat / state

Medical Survey in Rajanna Sirisilla District : దాత ఔదార్యం.. ఊరూరా ఉచిత వైద్యపరీక్షలు

author img

By

Published : Jun 27, 2023, 7:33 PM IST

Medical Survey
Medical Survey

Door to door medical survey in vemulawada : రాజన్నసిరిసిల్ల జిల్లాలో విద్యారంగంలో మార్పుతో పాటు వైద్యరంగంలోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేములవాడ నియోజకవర్గంలో చల్మెడ ఆనందరావు వైద్య కళాశాల ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంలోనూ వినూత్న పద్ధతిని అవలంభిస్తోంది. ప్రతి గ్రామంలో దాదాపు 70మంది హౌజ్ సర్జన్లతో ఇంటింటా సర్వే నిర్వహించడమే కాకుండా గ్రామంలో అందరి సమాచారాన్ని సేకరించి అవసరమైన వైద్యసేవలతో పాటు ఉచితంగా ఖరీదైన శస్త్రచికిత్సలూ చేపడుతోంది.

దాత ఔదార్యం.. ఊరూరా ఉచిత వైద్యపరీక్షలు

Medical Survey in Rajanna Sirisilla District : రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన చల్మెడ లక్ష్మినర్సింహరావు వైద్యరంగంలో స్థిరపడటంతో.. తన స్వగ్రామంతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను రెండు నెలల నుంచి వికాస తరంగిణి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించి.. అవసరమైన వారికి ఉచిత వైద్యం, ఔషధాలు అందిస్తున్నారు. అంతేకాకుండా అన్నిరకాల శస్త్రచికిత్సలను తమ ఆసుపత్రిలోనే చేపడుతున్నట్లు చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఛైర్మెన్‌ లక్ష్మినర్సింహరావు తెలిపారు. మెడికల్‌ కళాళాలకు చెందిన 70మంది వైద్యులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సర్వేలో కుటుంబ నేపథ్యం, ఆహార వ్యవహారాలు, వారసత్వంలో రుగ్మతలు, రక్తపోటు,మధుమేహం ఇతరత్రా వ్యాధులకు సంబంధించిన తదితర వివవరాలను సేకరిస్తారు. రక్తపోటు ఉంటే ఇప్పటికే వినియోగిస్తున్న మందులు ఏమిటి? దాని వల్ల ఏమైనా కొత్త జబ్బులు వస్తున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటింటా సర్వే నిర్వహించడం.. ఆ తర్వాత ఉచితంగా మందులు అందించడం పట్ల గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్ క్యాంపు అంటే కేవలం ఒక రోజు వచ్చి మందులు ఇచ్చి వెళ్లడం కాకుండా.. కుటుంబ సభ్యులకు అన్నివైద్య పరీక్షలు నిర్వహించి ఖరీదైన శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదైన వేళ.. చల్మెడ లక్ష్మినర్సింహరావు ఇంటింటా సర్వేలు నిర్వహించి వైద్యం చేయించడం అభినందనీయమని స్థానికులు అంటున్నారు

ఇప్పటికే దాదాపు 42 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మరో 80గ్రామాల్లో చేపట్టనున్నారు.ఈ సర్వే కేవలం వైద్యం వరకే పరిమితం చేయకుండా వివరాలను భవిష్యత్తులో రీసెర్చికి ఉపయోగపడే విధంగా రూపొందిస్తున్నారు.

"వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించి.. అవసరమైన వారికి ఉచిత వైద్యం, ఔషధాలు అందిస్తున్నాము. చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబ నేపధ్యం ఆహార వ్యవహారాలు, వారసత్వంలో రుగ్మతలు, రక్తపోటు,మధుమేహం ఇతరత్రా వ్యాధులకు సంబంధించిన తదితర వివవరాలను సేకరిస్తాము. వివరాల ఆధారంగా వారికున్న రుగ్మతలకు అనుగుణంగా డాక్టర్లను ఏర్పాటుచేసి వైద్యం అందిస్తాము. ఉచిత భోజనవసతిని కల్పిస్తున్నాము." - చల్మెడ లక్ష్మినర్సింహరావు, మెడికల్ కళాశాల ఛైర్మెన్‌

"మెడికల్ క్యాంపు అంటే కేవలం ఒక రోజు వచ్చి మందులు ఇచ్చి వెళ్లడం కాకుండా.. కుటుంబ సభ్యులకు అన్నివైద్య పరీక్షలు నిర్వహించి ఖరీదైన శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదైన వేళ.. చల్మెడ లక్ష్మినర్సింహరావు ఇంటింటా సర్వేలు నిర్వహించి ఉచితంగా వైద్యం చేయడం సంతోషంగా ఉంది". - స్థానిక గ్రామస్థులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.