ETV Bharat / state

RS Praveen kumar: 'బహుజన ఉద్యమానికి సిరిసిల్ల గుండెకాయ లాంటిది'

author img

By

Published : Feb 28, 2022, 4:34 AM IST

RS Praveen kumar: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్​ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో కోల హరీష్, పసుల బాలయ్య కుటుంబాలను ప్రవీణ్ కుమార్‌ పరామర్శించారు. బాధిత కుటుంబాలు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని.. న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

BSP leaders RS Praveen kumar comments on CM KCR
BSP leaders RS Praveen kumar comments on CM KCR

RS Praveen kumar: బహుజన ఉద్యమానికి సిరిసిల్ల గుండె లాంటిదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవీణ్​కుమార్​ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో కోల హరీష్, పసుల బాలయ్య కుటుంబాలను ప్రవీణ్ కుమార్‌ పరామర్శించారు. ఐదేళ్ల క్రితం జరిగిన నేరెళ్ల ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని.. న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిరిసిల్లలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రవీణ్ కుమార్‌.. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో వైకుంఠ దామాలు, కంపోస్ట్ షెడ్లు, రైతు వేదికల పేరిట దళితుల భూములను తెరాస ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ప్రవీణ్ కుమార్‌ ఆరోపించారు.

న్యాయం జరిగే వరకు అండగా..

"ఐదేళ్ల క్రితం జరిగిన నేరెళ్ల ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటాం. బహుజన ఉద్యమానికి సిరిసిల్ల గుండెకాయ లాంటిది. రైతుబంధు పేరిట సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో వైకుంఠదామాలు, కంపోస్ట్ షెడ్లు, రైతు వేదికల పేరిట దళితుల భూములను తెరాస ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నారు. తెరాస ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్​పై ఎందుకు కేసు పెట్టలేదు." - ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.