ETV Bharat / state

Bandi Sanjay: 'కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో చెప్పాలి'

author img

By

Published : Apr 10, 2022, 4:53 AM IST

Bandi Sanjay: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. వేములవాడ రాజన్న స్వామి దర్శనం చేసుకున్న సంజయ్‌.... తెరాస తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వడ్లు కొనకుండా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంత ధాన్యం ఇస్తారో చెప్పకుండా...కావాలనే సమస్య సృష్టిస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: 'కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో చెప్పాలి'
Bandi Sanjay: 'కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో చెప్పాలి'

Bandi Sanjay: ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా ధాన్యం తానే కొంటున్నట్లు ప్రచారం చేస్తూ కేంద్రం ప్రమేయమే లేనట్లు వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడెందుకు వడ్లు కొనకుండా రైతులను గోస పెడుతున్నారని ప్రశ్నించారు. చేతనైతే వడ్లు కొనాలని.. చేతగాకుంటే తక్షణమే గద్దె దిగపోవాలని హెచ్చరించారు. వేములవాడ రాజన్న స్వామి దర్శనం చేసుకున్న సంజయ్‌.... తెరాస తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వడ్లు కొనకుండా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస నేతల తీరుపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. గల్లీలో ముఖం చూపలేక దిల్లీ వెళ్లి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కోతలు మొదలయ్యాయన్న ఆయన... వడ్లను రైతులు తమ ఇండ్ల వద్ద నిల్వ చేసుకునే పరిస్థితి లేదన్నారు .కళ్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని అమ్ముకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని దళారులు తక్కువ ధరకే వడ్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మరో 20 రోజులు దాటితే రైతుల నుంచి వడ్లన్నీ దళారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

ఈ సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి వడ్లు కొనాల్సిన కేసీఆర్ ప్రభుత్వం .. ఆ బాధ్యతను విస్మరించి దిల్లీ పోయి రాజకీయాలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. దళారుల చేతిలోకి వడ్లన్నీ వెళ్లిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వడ్లను కొనే ప్రమాదం లేకపోలేదన్నారు. ఎందుకంటే దళారులకే మేలు చేయడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్... వడ్లన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని.. కేసీఆర్ దిల్లీ డ్రామాలను గల్లీలోనే ఎండగడతామని.... ప్రజలకు కేసీఆర్ బండారాన్ని బట్టబయలు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'తెలంగాణ రైతులపై ఎందుకంత కక్ష'.. కేంద్రానికి తెరాస ఎంపీల ప్రశ్న..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.