ETV Bharat / state

సింగరేణి సంస్థ నిర్లక్ష్యం... భూ నిర్వాసితుల దైన్యం...

author img

By

Published : Aug 25, 2019, 9:54 PM IST

సింగరేణి సంస్థ నిర్లక్ష్యం... భూ నిర్వాసితుల దైన్యం...

ఏళ్లుగా అక్కడి వారు ఆ భూములనే నమ్ముకుని జీవనం సాగించారు. పంటలు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. తమకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో కన్నతల్లి లాంటి నేలమ్మను ఓపెన్​ కాస్ట్​ విస్తరణ కోసం సింగరేణి సంస్థకు అప్పగించారు. పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న సింగరేణి అధికారులు అనంతరం వాటి ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారు. రోజులు గడుస్తున్నా పునరావాస కాలనీలు ఏర్పాటు కాక ఆవేదన చెందుతున్న పెద్దపల్లి జిల్లాలోని రచ్చపల్లి, అడ్యాల గ్రామాల పరిస్థితిపై ఈటీవీభారత్​ ప్రత్యేక కథనం...



పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లి, అడ్యాల గ్రామ ప్రజలు సింగరేణి సంస్థ నిర్వాకం వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆర్.జి 3, అడ్రియాల సింగరేణి ఓపెన్​ కాస్ట్​ విస్తరణలో భాగంగా ఇక్కడి ప్రజల భూములను స్వాధీనం చేసుకుని... ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ పునరావాస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం భూ నిర్వాసితులకు అందించే ఏ పథకాలు కూడా ఇక్కడి వారికి అందడం లేదు. సంస్థ మనుగడ కోసం తమ సర్వస్వం ధారపోసినా... అన్యాయం చేశారని ఈ గ్రామస్థులు వాపోతున్నారు.

సింగరేణి సంస్థ నిర్లక్ష్యం... భూ నిర్వాసితుల దైన్యం...

సా...గుతున్న పునరావాస కాలనీల నిర్మాణం

సింగరేణి సంస్థ రచ్చపల్లి, అడ్యాల గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు... మంథని మండలం బిట్టుపల్లి గ్రామ శివారులో 283 ఎకరాల అసైన్డ్​ భూమిని సేకరించింది. 2013లో భూ సేకరణ చేసి 2015లో పునరావాస కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2016లో పునరావాస కాలనీల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తూ... ఆనాటి మంథని ఎమ్మెల్యే పుట్టా మధు పలు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నాలుగేళ్లుగా కాలనీల నిర్మాణం సాగుతూనే ఉంది. కేవలం సీసీ రోడ్లు, డ్రైనేజీలను మాత్రమే పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.

రోడ్లు తప్ప ఇళ్లు లేవు...

సింగరేణి సంస్థ నిర్మిస్తోన్న పునరావాస కాలనీల్లో ఎటు చూసినా రోడ్లు తప్ప మరేమీ కానరావడం లేదు. భూ నిర్వాసితులకు ఏర్పాటు చేసే పునరావాస కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, బోర్లు, మంచినీటి సౌకర్యం, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనం, దేవాలయం, వైద్యశాల లాంటి అన్ని వసతులు కల్పిస్తామని... సింగరేణి అధికారులు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు.

భయాందోళనలో గ్రామస్థులు

సింగరేణి సంస్థ పునరావాస కాలనీలు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ఈ గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ... భయాందోళనతో జీవనం సాగిస్తున్నారు. సంస్థ స్వాధీనం చేసుకున్న గ్రామాలకు సమీపంలోని ఓపెన్​కాస్ట్​లో బ్లాస్టింగ్​ వల్ల గ్రామంలోని ఇళ్లకు ఎక్కడికక్కడ బీటలు వారి ప్రమాదకరంగా మారాయి. విషపూరిత రసాయనాలు గాలిలో కలిసి గ్రామస్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. తమకు అన్నం పెట్టే భూములు కోల్పోయి కనీస ఆదాయం లేక కొన్ని సార్లు పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొన్ని సార్లు సింగరేణి పనులు అడ్డకున్నా... అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప అది నెరవేరలేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ అధికారులు తమ అవస్థను గుర్తించి పునరావాస కాలనీలు త్వరగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: సెంటనరీ కాలనీలో హరితహారం..పాల్గొన్న జాయింట్ కలెక్టర్

TG_nzb_11_25_nanda_mahothsav_av_3180033 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) నిజామాబాద్ నగరంలో కృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణుడి జీవన ఘట్టాలను ఆవిష్కరించారు. నగరంలోని వ్యాస భవన్ లో సిక్వాల్ మార్వాడీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు ,చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణ తో తమ నృత్యం, అభినయం, పాటల ద్వారా కృష్ణ చరిత్రను వివరించారు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు కృష్ణుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను అధ్బుతంగా ప్రదర్శించారు...... vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.