ETV Bharat / state

'ధాన్యం కొనుగోలు కేెంద్రాల రద్దును ఉపసంహరించుకోవాలి'

author img

By

Published : Jan 6, 2021, 7:29 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ ఎమ్మెస్​ రాజ్ ఠాకూర్ ధర్నా నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

congress party demand for cancellation of grain purchasing centers should be withdrawn
'దాన్యం కొనుగోలు కేెంద్రాల రద్దును ఉపసంహరించుకోవాలి'

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజక ఇంచార్జీ ఎమ్మెస్​ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఈ చట్టాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ రహదారిపై పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.

కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు, మహిళలకు మేలు జరగాలనే ఉద్దేశంతో సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ​ రాజ్ ఠాకూర్ అన్నారు. కాని ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని రద్దు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండలం కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో బర్డ్​ఫ్లూ ఆనవాళ్లు లేవు : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.