ETV Bharat / state

Nizamabad Young Man Climbed Kilimanjaro : కిలిమంజారోను అధిరోహించిన నిజామాబాద్​ యువకుడు.. నెక్ట్స్ టార్గెట్​ అదే..!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 6:59 PM IST

Maruti Climbed Mount Kilimanjaro
Nizamabad Mountaineer Maruti Climbed Mount Kilimanjaro

Nizamabad Young Man Climbed Kilimanjaro : లక్ష్యం ఎంచుకుంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు కృషి ఉండాలి. కలలు కనగానే సరిపోదు.. సాకారం చేసుకునే సంకల్పం ఉండాలి. ఆ కృషి.. సంకల్పం తనలో మెండుగా ఉన్నాయని నిరూపించాడు నిజామాబాద్‌కు చెందిన మారుతి. పేదరికం అడ్డొస్తున్నా.. తన కలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాడు. ప్రతిఫలంగా ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. మరి ఆ యువకుడి భవిష్యత్‌ లక్ష్యం ఏంటి..? తన పర్వతారోహణ ప్రయాణం ఎలా సాగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Nizamabad Young Man Climbed Kilimanjaro కిలిమంజారోను అధిరోహించిన నిజామాబాద్​ యువకుడు నెక్ట్స్ టార్గెట్​ అదే

Nizamabad Young Man Climbed Kilimanjaro : పర్వతారోహణ అంటే మాటలు కాదు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సన్నద్ధం కావాలి. వాటన్నీంటిని విజయవంతంగా ఎదుర్కొని.. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగాడు ఈ యువకుడు. ఇటీవల కిలిమంజారో(Mount Kilimanjaro)ని అధిరోహించాడు. అక్కడ త్రివర్ణపతాక రెపరెపలాడించి.. తన చిన్ననాటి కలతో పాటు దేశభక్తిని చాటుకున్నాడు నిజామాబాద్(Nizamabad)​కు చెందిన మారుతి

నిజామాబాద్ జిల్లా మారుమూల గ్రామమైన నాళేశ్వర్‌కు చెందిన ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు మారుతి. చిన్నప్పటి నుంచి పర్వతాలు పర్వతారోహణ చేయాలని కలలు కనేవాడు. చదువులోనూ రాణించేవాడు. ఈ క్రమంలోనే బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ యువకుడు.

Rashtriya Bal Puraskar virat chandra : భళా విరాట్.. ఏడేళ్లకే కిలిమంజారో అధిరోహించిన చిన్నారి

పర్వతారోహణ చేయాలన్న తన కలకు అనుగుణంగా.. అందుకు సంబంధించిన అంశాలపై అవగాన పెంచుకున్నాడు మారుతీ. ఇంటర్‌ నుంచే వీటి కోసం కొన్ని ఆర్టికల్స్ చదివాడు. ఈ క్రమంలో పశ్చిమబంగలోని డార్జిలింగ్‌లో అవకాశం వచ్చినా ఆర్థిక సమస్యలతో వెల్లలేకపోయానని.. అయినా తన సాధనను ఆపలేదని అంటున్నాడు. పర్వతారోహణ ఖర్చుతో కూడుకున్నది. అయితే ఆ ఆర్థికభారం తల్లిదండ్రులపై పడకూడదు అని చాలా ప్రయత్నాలు చేశాడు మారుతి. అలా మనోడి ఆసక్తి గమనించి గ్రామస్థులు, మిత్రులు కొంతమేర ఆర్థిక సాయం చేశారు. మరో రూ.3 లక్షల వరకు అప్పుచేసి తన లక్ష్యాన్ని చేరుకున్నానని చెబుతున్నాడు.

Rare feet: 20 రోజుల్లోనే.. 9 పర్వతాల అధిరోహణ!

కిలిమంజారోను అధిరోహించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మారుతి. అయితే మువ్వన్నెల జెండా ఆ పర్వతంపై రెపరెపలాడించి పడ్డ కష్టాలను మర్చిపోయానని చెబుతున్నాడు. నిరంతర శ్రమ, ఆత్మస్థైర్యం.. ఇంకా అపజయాలు తనను ఈ గమ్యాన్ని చేర్చాయని అంటున్నాడు మారుతి. ఇక్కడితో తన లక్ష్య ఛేదన పూర్తి కాలేదని.. తర్వాత మౌంట్‌ ఎల్‌బ్రస్, రష్యా వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నట్లు చెబుతున్నాడు ఈ యువ పర్వతారోహకుడు.

"నాకు పర్వతారోహణ చేయాలని ఇంటర్​ చదువుతున్నప్పుడు ఆసక్తి కలిగింది. తర్వాత నేను ఇంటర్నెట్​లో పర్వతారోహణకు సంబంధించిన ఆర్టికల్స్​ చదివేవాడిని. కొన్ని రోజుల తర్వాత డార్జిలింగ్​ పర్వతారోహణ చేయడానికి అవకాశం వచ్చింది. కానీ అప్పుడు ఆర్ధికపరమైన కారణాలతో వెళ్లలేకపోయాను. అనంతరం నేను పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నాను. శిక్షణ అనంతరం.. ఆఫ్రికాలోని మౌంట్​ కిలిమాంజారో అధిరోహించడానికి సెలెక్ట్​ అయ్యానని చెప్పారు. మా గ్రామంలోని కొందరు యువకులు ఆర్ధిక సహాయం చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయవంతంగా మౌంట్​ కిలిమంజారో అధిరోహించాను". - మారుతి, పర్వతారోహకుడు, నిజామాబాద్​ జిల్లా

టాంజానియాలోని కిలిమంజారోను అధిరోహించిన తెలుగు కుర్రాడు‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.