ETV Bharat / state

కుటుంబ కలహాలతో అల్లుడిని చంపిన మామ

author img

By

Published : Jun 8, 2020, 1:21 PM IST

కుటుంబ కలహాలు ఓ వ్యక్తి హత్యకు కారణమైన ఘటన నిజామాబాద్​ జిల్లా కమ్మరపల్లి మండలంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అల్లుడు, మామ కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సహనం కోల్పోయిన మామ నిద్రిస్తున్న అల్లుడిని హత్య చేశాడు.

Man Murdered by Family Disputes
కుటుంబ కలహాలతో అల్లుడిని చంపిన మామ

నిజామాబాద్​ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్​ గ్రామ పరిధిలోని సోమిర్యాగుడి తండాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న అల్లుడిని మామ నరికి చంపాడు. గత కొద్ది రోజులుగా మామ పత్యా నాయక్​, అల్లుడు శర్మ నాయక్​ల కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

అల్లుడిపై కోపంతో ఆరుబయట నిద్రిస్తున్న శర్మ నాయక్​ను పత్యా నాయక్​ గొడ్డలితో నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.