ETV Bharat / state

మద్యంపై పందెం కాశాడు... ప్రాణాలు పోగొట్టుకున్నాడు

author img

By

Published : Jan 10, 2020, 7:54 PM IST

ఆ ముగ్గురూ స్నేహితులు...సరదగా కాచిన పందెం ఆ వారిలోని ఒకరి ప్రాణం బలిగొంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

ప్రాణాలు తీసిన స్నేహితుల పందెం...
ప్రాణాలు తీసిన స్నేహితుల పందెం...

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోసంగి కాలనీలో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. అందులో కాశయ్య అనే వ్యక్తి 20 నిమిషాల్లోనే ఫుల్ బాటిల్ విస్కీ తాగుతానని తన ఇద్దరు స్నేహితులతో పందెం కాశాడు. అప్పటికే సగం సిసా మద్యం తాగిన కాశయ్య... పందెం కోసం ఫుల్ బాటిల్ తాగారు. ఫలితంగా స్పృహ తప్పి పడిపోయాడు.

పోలీసుల అదుపులో కాశయ్య మిత్రులు...

బాధితుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే చనిపోయినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు కాశయ్య పాత ఇనుప సామాను అమ్ముకుంటూ జీవించేవాడని పేర్కొన్నారు. మృతునికి భార్య... ముగ్గురు కొడుకులు... ఒక కూతురు ఉందని సమాచారం. ఘటనతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ప్రాణాలు తీసిన స్నేహితుల పందెం...

ఇవీ చూడండి : అక్కను అనుమానిస్తున్నాడని బావను చంపిన బావమరిది

Tg_nzb_17_10_pranam_thisina_pandem_avb_ts10136 ********************************************* Rajendhar, etv contributer, indalvai () నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో స్నేహితుల మధ్య జరిగిన ఓ పదేం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఎసై పండేరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోసంగి కాలనీలో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు..అందులో కాశయ్య (30) అనే వ్యక్తి ఈ 20 నిమిషాలలో ఫుల్ బాటిల్ విస్కీ తాగుతానని మరో ఇద్దరు స్నేహితులతో పందెం కాశారు. అప్పటికే హాఫ్ బాటిల్ మద్యం తాగిన కాశయ్య పందెం కోసం ఫుల్ బాటిల్ తాగారు. స్పృహ తప్పి పడిపోవడంతో అతనిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎసై పేర్కొన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతునికి భార్య ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉందని పాత ఇనుప సామాను అమ్ముకొని జీవించేవారని పందెం కాసి కాశి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు..vis+byte BYTE : మృతుని కూతురు, ధర్పల్లి 2. పాండే రావు, ఎసై ధర్పల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.