ETV Bharat / state

MP Letter to CM KCR: సీఎం కేసీఆర్​కు భాజపా ఎంపీ లేఖ.. అందులో ఏముందంటే?

author img

By

Published : Jan 8, 2022, 10:19 PM IST

MP Letter to CM KCR: సీఎం కేసీఆర్​కు నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ లేఖ రాశారు. పసుపు రైతులను ఆదుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరారు.

MP Letter to CM KCR
సీఎం కేసీఆర్​కు భాజపా ఎంపీ లేఖ

MP Letter to CM KCR: రాష్ట్రంలో పసుపు రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. అధిక వర్షాలు, తెగుళ్ల సమస్యతో పంట నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పంట నష్టం అంచనాలు వేసి, తక్షణమే పరిహారం చెల్లించాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేసి ఉంటే... రైతులకు ఈ సమయంలో ఉపశమనం లభించి ఉండేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖలో వెల్లడించారు.

BJP MP Dharmapuri Arvind letter
నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ సీఎంకు రాసిన లేఖ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.