ETV Bharat / state

రైతుల ఆందోళనలు పట్టవా?: ఏఐకేఎమ్​ఎస్

author img

By

Published : Dec 19, 2020, 9:55 PM IST

కేంద్ర తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్​ బిల్లును రద్దు చేయాలని ఏఐకేఎమ్​ఎస్​​ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. అన్నదాతలను నట్టేట ముంచేలా ఉన్నాయని ఆరోపించారు. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డారు.

demands repeal of anti farmer laws nijamabad
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఏఐకేఎమ్​ఎస్​​ డిమాండ్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, జాతీయ విద్యుత్​ బిల్లులను రద్దు చేయాలని ఏఐకేఎమ్​ఎస్​ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. అన్నదాతలను నట్టేట ముంచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్​ భవన్​లో అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

విద్యుత్ బిల్లుతో రైతులపై భారం మోపే చర్యలు కేంద్రం చేపడుతోంది. బిల్లులు రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఇరవై రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడం అమానుషం. సమస్యల పరిష్కారానికి భవిష్యత్​లో ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి.

-ప్రభాకర్, ఏఐకేఎమ్​ఎస్ నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.