ETV Bharat / state

రాజన్నరాజ్యం కాదు.. రామరాజ్యం కావాలి: ఎంపీ అర్వింద్​

author img

By

Published : Feb 20, 2021, 4:36 PM IST

రాష్ట్రంలో రాజన్న రాజ్యం కాదు... రామరాజ్యం కావాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సర్కారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు: అర్వింద్​
అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు: అర్వింద్​

అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు: అర్వింద్​

తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ భూకబ్జాల పర్వం కొనసాగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తెరాస ఉపాధ్యక్షుడు జి.వి రమణ భాజపాలో చేరుతున్న నేపథ్యంలో బోథ్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీలు ధర్మపురి అర్వింద్​, సోయం బాపురావు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ధ్వజమెత్తారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు డీ వన్ పట్టాల పేరుతో వందల ఎకరాలను అంటకట్టారన్నారు. తన స్వలాభం కోసం జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కలెక్టర్ కార్యాలయాన్ని పట్టణ శివారుకు తరలించి వారికున్న భూముల విలువలు పెంచుకున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్నారు. హిందువుల చిరకాల వాంఛ రామమందిర నిర్మాణంపై తెరాస నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. భైంసాలో హిందువుల ఇళ్లు తగలబెడితే పరామర్శించిన నాయకుడు లేరని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని 500 కోట్లు వృథా చేశారని ఆరోపించారు. ఆ డబ్బును గల్ఫ్ బాధితులకు కేటాయిస్తే కొన్ని కుటుంబాలు బాగుపడేవని తెలిపారు. కోటి వృక్షార్చనలో ఎంపీ సంతోష్​ రూ.450 కోట్లు తిన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం కాదు... రామరాజ్యం కావాలన్నారు.

ఇదీ చదవండి: డెబ్భై శాతం సిమెంట్​ రోడ్లు పూర్తి చేశాం : ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.