ETV Bharat / state

Biryani: మున్సిపల్ కమిషనర్​కు స్పెషల్ బిర్యానీ... కాకపోతే మరీ ఇంత స్పెషలా?

author img

By

Published : Aug 3, 2021, 9:18 PM IST

నిర్మల్ కమిషనర్​కు చేదు అనుభవం ఎదురైంది. చికెన్ బిర్యానీ తిందామని తన సిబ్బందితో కలిసి హోటల్ లక్ష్మి గ్రాండ్​కు వెళ్లిన ఆయనకు వాంతి వచ్చినంత పనైంది. హోటల్​ యాజమాన్యం నిర్వాకం... సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే!

Municipal
మున్సిపల్ కమిషనర్​కు స్పెషల్ బిర్యానీ

మున్సిపల్ కమిషనర్​కు స్పెషల్ బిర్యానీ... కాకపోతే మరీ ఇంత స్పెషలా?

మధ్యాహ్నం అవుతోంది. చాలా ఆకలిగా ఉంది. దగ్గర్లో ఉన్న మంచి హోటల్​కు వెళ్లి చికెన్ బిర్యానీ (Chicken Birtyani) తినాలని అనుకున్నారు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ. అనుకున్న వెంటనే తన సిబ్బందితో కలిసి దగ్గర్లో ఉన్న హోటల్ లక్ష్మి గ్రాండ్​కు వెళ్లారు. తన సిబ్బందితో కలిసి హోటల్​లో కూర్చుని చికెన్ బిర్యానీ ఆర్డర్​ ఇచ్చారు. ఆకలి చంపేస్తోంది. బిర్యానీ రాగానే ఓ పట్టుపడదామని అందరూ వెయిటింగ్.

ఇంతలోనే వెయిటర్... చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చాడు. అందరికి వడ్డించాడు. మాంచి ఆకలి మీదున్న వాళ్లంతా బిర్యానీ ఆరగించడం మొదలుపెట్టారు. కొంచెం తిన్న తర్వాత బిర్యానీ ఏదో తేడాగా అనిపించింది. అనుమానం వచ్చి చూసేసరికి బిర్యానీలో పురుగులు కనిపించాయి. అంతే ఇక తిన్నదంతా బయటకు వచ్చింది. బిర్యానీ తింటున్నవారంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

స్వయంగా మున్సిపల్ కమిషనర్​కు వడ్డించిన దాంట్లోనే పురుగులు వచ్చాయి. వెంటనే హోటల్​ను తనిఖీ చేశారు. రిఫ్రిజిరేటర్​లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు కుళ్లిపోయి దర్శనమిచ్చాయి. చికెన్, మటన్​లో పురుగులు తారసపడ్డాయి. ఇక ఏ మాత్రం ఉపేక్షించకుండా... హోటల్​ను మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ సీజ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. వారి ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు.

'నేను లంచ్ చేస్తుండగా బిర్యానీలో బొద్దింకను గుర్తించా. వెంటనే మా సిబ్బందని అలెర్ట్ చేశా. వారికి ఒకరిద్దరికి ఇలానే జరిగింది. అవాక్కయ్యాం. ఇక్కడ ఇలా ఉంటే... కిచెన్​లో పరిస్థితి ఎలా ఉందని తనిఖీ చేశాం. ఫ్రిజ్​లో 10, 15 రోజుల నుంచి నిల్వ ఉంచిన చికెన్, మటన్ గుర్తించాం. కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాయి. కిచెన్ మధ్యలో డ్రైనేజీ వెళ్తోంది. వండిన పదార్థాల్ని అక్కడే పెట్టడం వల్ల ఈగలు, దోమలు వాలుతున్నాయి. వెంటనే యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి హోటల్​ను సీజ్ చేశాం.'

-- బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్

ఇదీ చూడండి: Fake Baba: సాఫ్ట్​వేర్​ నుంచి సాధువుగా.. భక్తి ముసుగులో దొంగ బాబా మహిమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.