ETV Bharat / state

పరిహారం కోసం ఆరు రోజులుగా భూ నిర్వాసితుల ఆందోళన

author img

By

Published : Feb 24, 2021, 7:14 PM IST

నిర్మల్‌ జిల్లాలోని సదర్మాట్ బ్యారేజీ భూ నిర్వాసితులు నష్టపరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఆరోరోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా మామడ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పొన్కల్ గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కోసం మూడేళ్ల కిందట భూములు కోల్పోయినట్లు వారు తెలిపారు.

6 days of protest for land compensation in nirmal district
పరిహారం కోసం 6 రోజులుగా భూ నిర్వాసితుల ఆందోళన

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఆరోరోజుకు చేరింది. బ్యారేజీ నిర్మాణంలో మూడేళ్ల కిందట భూములు తీసుకుని ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

పరిహారం విషయంలో అధికారులకు, నాయకులకు ఎన్నోసార్లు విన్నవించినా... పట్టించుకోలేదని అన్నారు. అందుకే పనులు నిలిపి వేసి ఇక్కడే మకాం వేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజి వద్దకు అధికారులు రాకపోవడంతో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. పరిహారం వెంటనే చెల్లించాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

6 days of protest for land compensation in nirmal district
పరిహారం కోసం 6 రోజులుగా భూ నిర్వాసితుల ఆందోళన

ఇదీ చదవండి: బాలలపై వేధింపుల కట్టడికి ఫేస్​బుక్​ కొత్త టూల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.