ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో పన్నెండేళ్ల బాలుడు మృతి

author img

By

Published : Feb 17, 2020, 11:32 PM IST

మొదటి సంతానం కలిగిన పదకొండేళ్లకు పుట్టిన పాప నలభై రోజుల్లోనే మృత్యుఒడికి చేరింది. ఆ విషాదఘటన జరిగిన ఏడాదికి మొదటి సంతానం కూడా ఆ తల్లిదండ్రులను విడిచి వెళ్లి... శోకసంద్రంలో ముంచేశాడు. సాయంత్రం నుంచి కన్పించకుండా పోయిన కొడుకు... అనుమానాస్పద స్థితిలో మరణించడం చూసి గర్భంతో ఉన్న ఆ తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది.

12 YEARS BOY SUSPICIOUS DEATH IN NIRMAL DISTRICT RAJAPUR THANDA
12 YEARS BOY SUSPICIOUS DEATH IN NIRMAL DISTRICT RAJAPUR THANDA

అనుమానస్పద స్థితిలో పన్నెండేళ్ల బాలుడు మృతి

నిర్మల్ జిల్లా కుంటాల మండలం రాజపూర్ తండాలో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జాదవ్ ఇతీష్ అనే 12 ఏళ్ల బాలుడు... తాండలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడు. ఉదయం నుంచి కుటుంబీకులు, తండావాసులు అంతా గాలించగా... పాఠశాల భవనం వెనుక భాగంలోని మక్క తోటలో శవమై కనిపించాడు. పోలీసులకు సమాచారమందించగా.... ఘటన స్థలానికి చేరుకొని డాగ్​స్క్వాడ్​లతో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ శశిధర్​రాజు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇద్దరు పిల్లలూ మృత్యు ఒడికి...

మృతుడి తల్లి జాదవ్ ఉష ,తండ్రి జాదవ్ సంజుకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానం జాదవ్​ కాగా... సంవత్సరం క్రితం రెండో సంతానంగా పాప జన్మించింది. ఆ పసికందు 40 రోజుల తర్వాత అనారోగ్యంతో మృతి చెందింది. ప్రస్తుతం జాదవ్​ ఉష గర్భవతిగా ఉంది. ఈ సమయంలో ఇలాంటి విషాదం జరగటం వల్ల వారి కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి: ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.