ETV Bharat / state

అంతన్నారు.. ఇంతన్నారు.. ఊటనీటిలో వదిలేశారు..!

author img

By

Published : Sep 4, 2020, 2:46 PM IST

neragadam village problems
అంతన్నారు.. ఇంతన్నారు.. ఊటనీటిలో వదిలేశారు..!

మీరు త్యాగం చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అధికారులు హామీ ఇచ్చారు. అందరూ సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తామని.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.. పదేళ్లు గడిచినా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారైందని సంగం బండి రిజర్వాయర్​ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. రోజూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు.

అంతన్నారు.. ఇంతన్నారు.. ఊటనీటిలో వదిలేశారు..!

రిజర్వాయర్​ కోసం వందల ఎకరాలు వదులుకున్నారు.. ప్రాజెక్టు వేగంగా పూర్తయితే వేల కుటుంబాలు బాగుపడతాయని సంబురపడ్డారు.. పునరావాసంలో భాగంగా ఇళ్లు కేటాయిస్తామంటే మురిసిపోయారు.. కానీ ఇదంతా గతం. అంటే పదేళ్ల కిందటి పరిస్థితి... పరిహారం అందక.. ప్రాజెక్టుతో ఇంట్లోకి ఊట నీరుతో అవస్థలు పడుతూ.. ప్రభుత్వం, అధికారుల చేయూత కోసం ఎదురు చూపులు.. ఇది ప్రస్తుతం పరిస్థితి.. నారాయణపేట జిల్లా మాగనూర్​ మండలం నెరడగం గ్రామస్థుల దుస్థితి.

సంగం బండ రిజర్వాయర్.. నెరడగం గ్రామానికి కేవలం ఎనిమిది వంద మీటర్ల దూరంలోనే ఉంది. నిర్మాణ సమయంలో హామీల వర్షం కురిపించిన అధికారులు.. అనంతరం తమవైపు చూడడం మానేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా.. ఎప్పుడు వర్షం కురిసినా.. ఊట నీరుతో అవస్థలు పడుతూనే ఉన్నామని వాపోయారు. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం వల్ల గోడలు, ఇళ్లు కూలి ఎందరో నిరాశ్రయలు, మరెందరో క్షతగాత్రులయ్యారని కంటతడిపెట్టారు. మరికొంత మంది ఇళ్లలో రోజుల తరబడి మోటార్లు పెట్టి నీరు బయటకు తీయాల్సిన పరిస్థితి ఉందంటే.. అక్కడ ఎలాంటి దుస్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామో అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు.

సంగం బండ రిజర్వాయర్ 3.317 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మాగనూరు మండలం నెరడగం గ్రామంలో 2800 ఎకరాల భూమి ముంపునకు గురైంది. రిజర్వాయర్​కు కేవలం 800 మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఫలితంగా ఊట నీరు ప్రభావం సహా పాములు, విష పురుగులు అధికంగా వస్తున్నాయని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పునరావాసం జీవో ప్రకారం ఆదుకోవాలని నెరగడం గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు స్పందించి తమ గోడు వినాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.