ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

author img

By

Published : Nov 5, 2020, 10:48 PM IST

నారాయణపేట తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి పోర్టల్​ ప్రక్రియను కలెక్టర్​ హరిచందన పరిశీలించారు. అనంతరం రెండు గిఫ్ట్​ రిజిస్ట్రేషన్​, ఒక సేల్​ రిజిస్ట్రేషన్​ పాస్​ పుస్తకాలను రైతులకు కలెక్టర్​ అందజేశారు.

narayanpet collector harichandana inspected mro office and dharani portal process
తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

నారాయణపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయంలో జరుగుతున్న ధరణి ప్రక్రియను కలెక్టర్​ హరిచందన పరిశీలించారు. ధరణి ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ఎంత సమయంలో పూర్తవుతోంది? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొలంపల్లి జమ్ములమ్మ కుమారుడు నెహ్రూనాయక్, సరోజమ్మ కుమారుడు సత్యనారాయణరెడ్డి గిఫ్ట్​ రిజిస్ట్రేషన్​ చేసుకోగా సీతమ్మ తనయుడు నరేష్​కుమార్​కు సేల్​ రిజిస్ట్రేషన్​ పాస్​ పుస్తకాలను కలెక్టర్​ అందజేశారు.

ధరణి ప్రక్రియలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్​కు హరిచందన ఆదేశించారు. జిల్లాలో మొత్తం 23 మంది స్లాట్​ బుకింగ్​ చేసుకున్నారని కలెక్టర్​ తెలిపారు. మద్దూర్​లో 7, కోస్గి, దామరగిద్ద, ధన్వాడలో 3 చొప్పున, ఉట్కూరులో రెండు, నర్వ, మక్తల్​లో ఒక్కోటి స్లాట్​ బుకింగ్​ పూర్తయినట్లు హరిచందన వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.