ETV Bharat / state

పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన

author img

By

Published : Nov 26, 2020, 12:03 PM IST

farmers at cci centre to buy cotton today in narayana peta district
పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన

అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో సీసీఐ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలంటూ రైతన్నలు ఆందోళన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొనుగోళ్లు నిలిపివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు టోకెన్​ నంబరు ఉన్న రైతులు పత్తిని విక్రయించడానికి సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చారు.

నివర్ తుఫాన్​ ప్రభావంతో మూడురోజుల పాటు పత్తి కొనుగోలు చేయడం లేదని అధికారులు చెప్పడంతో రైతులు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఈ ఒక్కరోజు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించుకున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 862 కరోనా కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.