ETV Bharat / state

తక్కువ ఖర్చులో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం

author img

By

Published : May 30, 2020, 5:36 PM IST

Updated : May 31, 2020, 9:49 AM IST

మరుగుదొడ్లకు నూతన హంగులు
మరుగుదొడ్లకు నూతన హంగులు

ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేక జనం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కావాల్సిన చోట మరుగుదొడ్లు నిర్మించడం, నిర్వహించడం ప్రభుత్వానికీ ఆర్ధికంగా భారమే. నారాయణపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన చవకైన మరుగుదొడ్ల నిర్మాణం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. కలెక్టర్ హరిచందన చొరవతో వైద్యారోగ్య కేంద్రాల్లో వీటి నిర్మాణం కొనసాగుతోంది.

నారాయణపేట జిల్లాలో తక్కువ ధరకే మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మక్తల్, ఊట్కూరు, మాగనూరు సహా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తక్కువ సమయంలోనే, తక్కువ స్థలంలో పెద్దగా ఖర్చేమీ లేకుండానే నిర్మించుకోవడం ఈ మరుగుదొడ్ల ప్రత్యేకత. వీటి నిర్మాణానికి వినియోగించే కాంక్రీటు రింగులు, లావెట్రీ బేషన్, కుళాయి, పైప్ లైన్ అంతా రెడీమేడ్ సామాగ్రే. కేవలం రెండు, మూడు రోజుల వ్యవధిలోనే వీటిని నిర్మించవచ్చు. మొత్తంగా రూ. 10 వేల ఖర్చులోపే మురుగుదొడ్లు సిద్ధం చేసుకోవచ్చు.

మరుగుదొడ్లకు కొత్త హంగులు

ప్రభుత్వ కార్యాలయాల్లో నూతనంగా నిర్మించే మరుగుదొడ్లకు అదనపు హంగులు అద్దుతున్నారు. రకరకాల రంగులు, డిజైన్లు, బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఖర్చులు మాత్రం రూ.10 వేలకు అదనం.

జిల్లాలో ప్రయోగాత్మకంగా..

హైదరాబాద్​లో ఆర్నెళ్ల కిందట ఇంక్ వాష్ పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ అనే వ్యక్తి ఈ చవకైన మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కార్యశాలకు హాజరైన కలెక్టర్ హరిచందన నారాయణపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలుచోట్ల 15 మరుగుదొడ్లు నిర్మించారు. నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో అధిక రద్దీ ప్రాంతాలు, మురికి వాడల్లో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ మరుగుదొడ్డి నిర్మించుకొని వారికి, నిరుపేదలకు ఈ నమూనాను ప్రతిపాదించనున్నారు.

కొత్త సూచనలు వస్తున్నాయి..

ప్రస్తుతం నిర్మిస్తున్న మరుగుదొడ్డికి కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ సూచనలు వస్తున్నాయని కలెక్టర్ హరిచందన తెలిపారు. మరుగుదొడ్డిలో గాలి, వెలుతురు కోసం వెంటిలేటర్లు, వెలుపల వాష్ బేషిన్ లాంటివి ఏర్పాటు చేయాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

గాలి, వెలుతురు కోసం వెంటిలేటర్లు !

మరుగుదొడ్డి నిర్మించడం మాత్రమే కాదు.. వాటిని సక్రమంగా వినియోగించడమూ ముఖ్యమే. అందువల్ల నిర్వహణకు అవకాశం ఉన్న చోట మాత్రమే ఈ తరహా మరుగుదొడ్లు నిర్మించనున్నారు. పట్టణ ప్రణాళికలో భాగంగా అధిక రద్దీ ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాలని మున్సిపాలిటీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

తక్కువ ఖర్చులో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం

ఇవీ చూడండి : దేశంలో 24 గంటల్లోనే 7964 కేసులు, 265 మరణాలు

Last Updated :May 31, 2020, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.