ETV Bharat / state

కన్నుల పండువగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం

author img

By

Published : Dec 30, 2020, 8:26 PM IST

శ్రీ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భగవన్నామ స్మరణతో రథాన్ని భక్తులు లాగగా.. ఆలయ ప్రాంగణాలు మారుమోగిపోయాయి.

Anjaneya Swami organized the chariot festival in  narayanpet
కన్నుల పండువగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఉత్సవమూర్తి రథంలో ఉండగా.. భగవన్నామ స్మరణతో రథాన్ని భక్తులు లాగారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి: లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.