ETV Bharat / state

నెమ్మదించిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్​కు తగ్గిన వరద

author img

By

Published : Aug 24, 2020, 12:23 PM IST

కృష్ణమ్మ కాస్త నెమ్మదించడం వల్ల నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొంచెం తగ్గింది. సాగర్ 8 గేట్లను ఎత్తిన అధికారులు లక్షా 15,344 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

nagarjuna sagar dam eight crust gates are opened
నాగార్జునసాగర్​కు తగ్గిన వరద

ఎగువన కురుస్తున్న వర్షాలకు పదిరోజులుగా పరుగులంకించుకున్న కృష్ణమ్మ వానలు తగ్గుముఖం పట్టడం వల్ల కాస్త నెమ్మదించింది. దీనివల్ల నాగార్జునసాగర్​ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. సాగర్ 8 గేట్లను ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు లక్షా 15,344 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,54 ,486 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. కుడి, ఎడమ కాల్వలు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్​కు తగ్గిన వరద

సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడగులకు 587 అడగుల వద్ద నీటిని నియంత్రిస్తున్నారు. సాగర్ జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలు గాను ప్రస్తుతం 305.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.