ETV Bharat / state

సోషల్​ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఈసీకి పాల్వాయి స్రవంతి ఫిర్యాదు

author img

By

Published : Nov 3, 2022, 2:11 PM IST

Palvai Sravanti Complaint to EC: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్​ సజావుగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్​ ఆ తర్వాత ఊపందుకుంది. మునుగోడులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, తెరాస, భాజపా అభ్యర్థులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే తన ఫొటో మార్ఫింగ్​ చేసి సోషల్​ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పాల్వాయి స్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు.

Palvai Sravanti
Palvai Sravanti

Palvai Sravanti Complaint to EC: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్​ సజావుగా సాగుతోంది. ఉదయం మందకొడిగా సాగినా.. ఆ తర్వాత నెమ్మదిగా ఊపందుకుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు నిఘా పెడుతున్నారు. మునుగోడులో ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్​ అభ్యర్థులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్​ దృష్టికి 28 ఫిర్యాదులు రాగా.. తాజాగా పాల్వాయి స్రవంతి సైతం ఈసీని ఆశ్రయించారు. తన ఫొటో మార్ఫింగ్​ చేసి సోషల్​ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​​రాజ్​ వారిపై చట్టపరంగా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

"మీకు దమ్ము, ధైర్యం ఉంటే నన్ను ఎన్నికల్లో ఎదుర్కొండి. నేను నైతికంగా బతికన మహిళను. నేను నమ్ముకున్న పార్టీని విడిచిపెట్టే మహిళను కాను. ఆ నైతికత నాకు మా తండ్రి నుంచి వచ్చింది. ఏదో ఇలాంటి పనుల వల్ల నా మనోధైర్యం దెబ్బకొట్టాలని చూస్తే అది మీ పిచ్చి పని. ఇలాంటి వాటిని సహించేది లేదు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా". -పాల్వయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి.

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.