పార్టీకి నమ్మిన బంటు, ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 2:11 PM IST

Huzurnagar MLA Nalamada Uttam Kumar Reddy Biodata
Minister Uttam Kumar Reddy Profile ()

Minister Uttam Kumar Reddy Political Profile : తెలంగాణలో కాంగ్రెస్​ సీనియర్​ నేతల ప్రస్థావన వచ్చిందంటే అందులో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది. దాదాపు మూడు దశాబ్ధాలుగా పార్టీకి నమ్మిన బంటుగా, ఆపత్కాలంలో ఆపద్భాందవుడిలా నిలుస్తున్నారు. హస్తం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి పోరులోనే ఓటమిని ఎదుర్కొన్నారు. అయినా బెదరకుండా ఓటమి చెందిన స్థానం నుంచే మరోసారి బరిలో నిలిచి విజయఢంకా మోగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. గతంలో ఓసారి మంత్రిగా చేసిన ఆయన, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కేబినెట్​లో మరోసారి మంత్రి స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయనే హుజూర్​నగర్​ ఎమ్మెల్యే ఉత్తమ్​ కుమార్​ రెడ్డి. ఆయన ప్రస్థానంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం మీకోసం.

Minister Uttam Kumar Reddy Political Profile : నలమాద ఉత్తమ్ కుమార్‌ రెడ్డి 1962 జూన్‌ 20న నల్గొండ జిల్లాలో జన్మించారు. బీఎస్సీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఆయన కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నల్గొండ ఎంపీగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కాలం పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్ పైలట్​గా, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీనియర్ కమర్షియల్ పైలెట్స్ లైసెన్స్ హోల్టర్‌గా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సేవలందించారు.

Huzurnagar MLA Nalamada Uttam Kumar Reddy Biodata : రాష్ట్రపతి భవన్‌లో భద్రత, ప్రొటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా ఉత్తమ్‌ పని చేశారు. 1994లో కాంగ్రెస్‌ తరపున కోదాడ నుంచి బరిలోకి దిగి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నుంచే విజయం సాధించారు. 2009, 2014లో హుజూర్​నగర్ నుంచి బరిలోకి దిగి, వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు 2011 జనవరిలో అప్పటి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కిరణ్ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి 2014 వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు.

రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్​ భేటీ పెట్టారేమో : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

2014లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికైన ఉత్తమ్, 2015 నుంచి జూన్ 2021 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు. 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అదే సంవత్సరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మళ్లీ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఉత్తమ్ వర్సెస్ సైదిరెడ్డి - హుజూర్​నగర్​లో కిడ్నాప్ డ్రామా - అసలేం జరిగింది?

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి బయోడేటా:

  • జననం 20 06 1962
  • బీఎస్సీలో గ్రాడ్యుయేట్ చేసిన ఉత్తమ్‌
  • భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్ పైలట్​గా విధులు
  • నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీనియర్ కమర్షియల్ పైలెట్స్ లైసెన్స్ హోల్టర్
  • రాష్ట్రపతి భవన్‌లో భద్రత, ప్రొటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా పని చేసిన ఉత్తమ్‌
  • కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌ కుమార్ రెడ్డి
  • 1994లో కాంగ్రెస్‌ తరఫున కోదాడ నుంచి బరిలోకి దిగి తొలి ఎన్నికల్లో ఓటమి
  • 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నుంచే విజయం సాధించిన ఉత్తమ్‌
  • 2009, 2014లో హుజూర్​నగర్ నుంచి బరిలోకి దిగి వరుస విజయాలు
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కిరణ్ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి 2014 వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేసిన ఉత్తమ్‌
  • 2014లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, 2015 నుంచి జూన్ 2021 వరకు పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించిన ఉత్తమ్‌
  • 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
  • 2018లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా
  • 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఉత్తమ్‌

కోదాడలో కాంగ్రెస్​కు మద్దతు తెలిపిన టీడీపీకి రుణపడి ఉంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీఎం అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరి పేరు ప్రకటించినా నాకు నో ప్రాబ్లమ్ : ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.