ETV Bharat / state

మునుగోడు ప్రచారానికి వెళ్లనని స్పష్టం చేసిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

author img

By

Published : Oct 17, 2022, 1:19 PM IST

Updated : Oct 17, 2022, 2:33 PM IST

Komati Reddy Venkat Reddy
Komati Reddy Venkat Reddy

13:13 October 17

మునుగోడు ప్రచారానికి వెళ్లనని స్పష్టం చేసిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

Venkat Reddy Said Did Not Participate Munugode Campaign: మునుగోడు ప్రచారానికి వెళ్లనని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మునుగోడులో నాలాంటి హోంగార్డ్స్ ప్రచారం అవసరం లేదని.. ఎస్పీ స్థాయి వాళ్లే అక్కడ ప్రచారానికి వెళ్తారని పేర్కొన్నారు. గాంధీభవన్‌లోని కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల‌్లో ఆయన తన ఓటును వినియోగించుకున్నారు. కడియం శ్రీహరి తనను విమర్శించే స్థాయి లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.

"మునుగోడుకు ఎస్పీలు పోతారు. హోంగార్డ్స్ పోరు. తనపై 100కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ఓ పెద్దమనిషి చెప్పారు. ఆయనే గెలిపించుకుంటారు. మోతలు మాట్లాడారు. అందుకే మేం దూరంగా ఉన్నాం." - కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీ

ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలను కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మిగతా ప్రధాన పార్టీల కంటే ముందే ప్రచారం చేపట్టింది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థిని త్వరితంగానే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక ప్రచార హోరు పెంచాల్సిన కాంగ్రెస్‌ కాస్త వెనుకపడింది. భాజపా, తెరాస రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని రంగంలోకి దించి జోరు పెంచితే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బూత్​ స్థాయి సమన్వయకర్తలు, క్లస్టర్‌ ఇంఛార్జ్​లు మండలానికి సీనియర్లను ఇంఛార్జ్​లుగా నియమించినా ఆ దిశగా ప్రచారంలో ఊపు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడప గడపకు ప్రచారాన్ని ఉద్ధృతం చేయాల్సిన కాంగ్రెస్‌ వెనుకపడిపోతోంది. రేవంత్‌ రెడ్డితో పాటు ఉత్తమ్‌, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, సంపత్‌కుమార్‌, వీహెచ్, జీవన్​రెడ్డి, శ్రీధర్‌బాబులు మండలాల ఇంఛార్జ్​లుగా ఉన్నారు.

క్షేత్రస్థాయిలో సీనియర్‌ నాయకులు భాజపా, తెరాసకు దీటుగా ముందుకెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్‌, ఉత్తమ్‌ సీతక్క, సంపత్‌కుమార్‌ వారంపాటు నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేశారు. నామినేషన్‌ రోజున నేతులంతా ఐక్యంగా హాజరయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే కాంగ్రెస్‌ ప్రచారం అటకెక్కింది. అభ్యర్థి స్రవంతి మాత్రమే ఇంటింటా ప్రచారంతో కార్యక్షేత్రంలో కదులుతున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నిర్ణయంతో పార్టీ నేతల రియాక్షన్ ఏమిటోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి: మునుగోడు ప్రచారంలో వెనకపడిపోయిన కాంగ్రెస్‌.. ముఖం చాటేస్తున్న కీలక నేతలు

ప్రతి పల్లెనూ చుట్టేస్తున్న నేతలు.. మునుగోడులో ప్రచార జోరు తగ్గేదే లే..

'గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలం'

భాజపా X ఆప్​ X కాంగ్రెస్..​ గుజరాత్‌ బరిలో 'త్రిముఖ' వ్యూహాలు

Last Updated :Oct 17, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.