ETV Bharat / state

అక్కడ వంద మందికి ఉచిత కొవిడ్ టీకా

author img

By

Published : Apr 26, 2021, 6:31 PM IST

మిర్యాలగూడకు చెందిన ఓ వైద్యురాలు వృత్తిరిత్యా అమెరికాలో స్థిరపడింది. పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకుంది. స్వచ్ఛంద సేవకుడు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో వంద మందికి ఉచిత కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 miryalaguda, free corona vaccine
miryalaguda, free corona vaccine,

నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని వాసంతి ఆసుపత్రిలో వంద మందికి ఉచిత కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛంద సేవకుడు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో టీకా అందజేశారు. ఈ రోజు పదిమందికి వ్యాక్సిన్ మొదటి డోసు వేశారు. ఆన్​లైన్​లో బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో రోజూ వేస్తామని తెలిపారు.

"మిర్యాలగూడకు చెందిన ఓ వైద్యురాలు వృత్తిరిత్యా అమెరికాలో స్థిరపడింది. పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో.... తన స్నేహితుడైన రంగా శ్రీధర్ సేవా కార్యక్రమాల ప్రేరణతో ఈ కార్యక్రమం తలపెట్టారు. వందమందికి రూ.50వేల విలువైన కరోనా టీకాలను రెండు డోసులు వేయించేందుకు ముందుకు వచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడం అభినందనీయం"

- హమీద్ షేక్, రంగా శ్రీధర్ సహాయకుడు

ఇదీ చూడండి: సుప్రీంకు ముందుగానే వేసవి సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.