ETV Bharat / state

'మధ్యాహ్నం' మిథ్యేనా... పాఠశాలలో విద్యార్థులకు పస్తులేనా?

author img

By

Published : Feb 5, 2021, 9:13 AM IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​ నిబంధనలతో పాఠశాలలు ప్రారంభించినప్పటికీ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. భోజనం కోసం విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు.

అమలుకాని మధ్యాహ్న భోజన పథకం.. విద్యార్థులకు తప్పని ఇక్కట్లు
అమలుకాని మధ్యాహ్న భోజన పథకం.. విద్యార్థులకు తప్పని ఇక్కట్లు

కొవిడ్​ వల్ల 11 నెలల తర్వాత పాఠశాలలు తెరచిన ప్రభుత్వం.. విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం దృష్టి సారించడం లేదు. 9, 10 తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరుగుతున్న పాఠశాలల్లో.. కొన్నిచోట్ల మధ్యాహ్నం భోజనం అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి పాఠశాలలో... ఏజెన్సీలు భోజనం వండేందుకు ముందుకు రాలేదు. పిల్లలు ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని... ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

ఒక్కచోటే కాదు..

ఒక్క డిండి చింతపల్లి మాత్రమే కాదు. నారాయణపేట జిల్లా జాజరాలలో అదే పరిస్థితి ఉంది. మరికల్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ ముందుకు రాకపోవడం వల్ల.. వేరేవాళ్లతో వంటలు వండిస్తున్నారు. మక్తల్ మండలం గుడిగండ్లలో అంతకుముందు పాఠశాలలో స్వీపర్​గా పనిచేసిన వ్యక్తికే... వంట బాధ్యతలు అప్పగించారు. ఇలా చాలాపాఠశాలల్లో వండేందుకు ఏజెన్సీలు ముందుకు రాక ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. పాఠశాలలు తెరచిన తొలిరోజు.. చాలా చోట్ల ఉపాధ్యాయులే వంట చేశారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని.. విద్యార్థులు సహా ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అమలుకాని మధ్యాహ్న భోజన పథకం.. విద్యార్థులకు తప్పని ఇక్కట్లు

ఇదీ చూడండి: రాష్ట్ర బడ్జెట్​లో మూడోవంతుకు పైగా రైతులకే ఖర్చు: మంత్రి హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.