ETV Bharat / state

ఎల్లూరు లిఫ్ట్​లో రెండో పంపు నీటి ఎత్తిపోతలు ప్రారంభం

author img

By

Published : Dec 21, 2020, 8:15 AM IST

kli-elluru-lift-second-pump-restoration-at-sunday-in-nagarkurnool-district
ఎల్లూరు లిఫ్ట్​లో రెండో పంపు నీటి ఎత్తిపోతలు ప్రారంభం

ప్రమాదానికి గురైన ఎల్లూరు లిఫ్ట్​లో రెండో పంపు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. అక్టోబర్​ 16న మోటారు ప్రమాదానికి గురికాగా... మరమ్మతులు చేపట్టి నవంబరు 21న పంపు-1 ప్రారంభించారు. ఆదివారం నాడు పుంపు-2ని అధికారులు పునరుద్ధరించారు.

ఎల్లూరు లిఫ్ట్​లో రెండో పంపు నీటి ఎత్తిపోతలు ప్రారంభం

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదానికి గురైన ఎల్లూరు లిఫ్ట్​ రెండో పంపు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించి... శ్రీశైలం మిగులు జలాల నుంచి రెండో పంపు ద్వారా నీటి ఎత్తిపోతను అధికారులు పునరుద్ధరించారు.

కేఎల్​ఐ పథకంలో మొదటి పంపు హౌజ్​ ఎల్లూరు లిఫ్ట్​లో అక్టోబర్ 16న పెద్ద శబ్దంతో మూడో మోటారు ప్రమాదానికి గురైంది. ఫలితంగా పంప్ హౌజ్ నిండా నీరు చేరి ఎత్తిపోత ఆగిపోయింది. సుమారు రెండు నెలల పాటు శ్రమించిన అధికారులు నీటిని ఎత్తిపోసి మోటార్లకు మరమ్మతులు చేశారు. నవంబర్ 21న మొదటి పంపును ప్రారంభించారు. మరో పది రోజుల పాటు మరమ్మతులు చేపట్టి రెండో పంపుని పునరుద్ధరించారు. ప్రస్తుతం ఒక్కో మోటార్​కు 800 క్యూసెక్కుల చొప్పున ఎల్లూరు రిజర్వాయర్​ను నింపడానికి నీటిని ఎత్తిపోస్తున్నారు.

ఎల్లూరు జలాశయం నుంచే ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో సుమారు 1,550 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు విడుదల చేయాల్సి ఉంది. యాసంగి పంటలకూ ఇదే పంప్ హౌజ్ నుంచి నీరు విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి: ఫామ్‌హౌస్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.