ETV Bharat / state

'తాను లేకపోతే నేను లేను.. ఎక్కడున్నా రావాలి.. పెళ్లి చేసుకోవాలి'

author img

By

Published : Apr 3, 2023, 4:58 PM IST

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు. చెల్లి పెళ్లి తర్వాత మన పెళ్లి అన్నాడు. ఐదేళ్లు కలిసి తిరిగారు. తీరా చెల్లి పెళ్లి తర్వాత నువ్వెవరో తెలువదు అంటున్నాడు నాగర్​కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్కక్తి. ఇన్నాళ్లు కలిసున్నాం. పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టాడు. ఇప్పుడు తాను లేకుంటే నేను లేను అని బోరున విలపిస్తుంది బాధితురాలు.

A girlfriend who is protesting in front of her boyfriend's house saying that she is not getting married
'తాను లేకపోతే నేను లేను.. ఎక్కడున్నా రావాలి.. పెళ్లి చేసుకోవాలి' ప్రియుడి ఇంటి ముందు ధర్నా

నాగర్​కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్​మెంట్ చేసుకొని తర్వాత ముఖం చాటేయడంతో ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ జరిగింది: కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామానికి చెందిన ఓ మహిళ జూనియర్ లెక్చరర్​గా పనిచేస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు బురాన్. అయితే ఇద్దరు 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించి ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు. అయితే బురాన్​ ఎంగేజ్​మెంట్ అయిన సమయంలో తన చెల్లి పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఒప్పించాడు. ఇద్దరు 5సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఎంగేజ్​మంట్ అయిన 3ఏళ్ల తర్వాత చెల్లి పెళ్లి చేశాడు.

తర్వాత కొంతకాలానికి రిజ్వానతో మాట్లాడకుండా ముఖం చాటు వేసే ప్రయత్నం చేశాడు. ఆమెఎంత ప్రయత్నం చేసిన మాయమాటలు చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకుందామని నిలదీయగా సముదాయించి కొంతకాలం ముఖం చాటు చేటేశాడు. చివరికి ఏం చేయాలో తెలియక ప్రియుడి కోసం అకని ఇంటి ఎదుట కూర్చోని నిరసన వ్యక్తం చేసింది. తనను మోసగించాడని విలువలతో బతికిన తన కుటుంబంలో బురాన్ చిచ్చురేపాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనతో ఎంగేజ్​మెంట్ కూడా పెద్దల సమక్షంలోనే జరిగిందని కానీ పెళ్లి విషయం వచ్చే వరకు పెద్దలు కూడా స్పందించడం లేదన్నారు.

నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నా. ఒక్కరు కూడా తలుపు తెరవడం లేదు. నువ్వేవరో మాకు తెలియదు అనే విధంగా మాట్లాడుతున్నారు.ఇన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నప్పటికి నాకు ఆమెకు సంబంధం లేదని అంటున్నాడు. బురాన్​తో నాకు పెళ్లి జరగాలి. అది జరగకపోతే నేను మీ అందరి సమక్షంలోనే ఆత్మహత్య చేసుకుంటాను. నేనిచ్చిన డబ్బులు ఇవేమి నేను ఆశించడం లేదు. కేవలం బురాన్​తో పెళ్లి మాత్రమే ఆశిస్తున్నాను. బురాన్ ఎక్కడున్నా తక్షణమే రావాలి. పెళ్లి చేసుకోవాలి. అంత వరకు ఇక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదు. అతను నిత్యం పెళ్లి కొడుకు. 2013లో కూడా ఒక ఎంగేజ్​మెంట్ చేసుకుని రద్దు చేశాడు. ఇప్పుడు నన్ను అలాగే చేస్తున్నాడు. నా ఎంగేజ్​మెంట్ రద్దు కాకముందే ప్రస్తుతం భూత్పూర్ నుంచి ఒక అమ్మాయిని ఎంగేజ్​మెంట్ చేసుకున్నాడు. ఈ నెల 28న పెళ్లి చేసుకోబోతున్నాడు. బురాన్ ఎక్కడున్నా ఇక్కడకి రావాలి, పెళ్లి చేసుకోవాలి."_ బాధితురాలు

'తాను లేకపోతే నేను లేను.. ఎక్కడున్నా రావాలి.. పెళ్లి చేసుకోవాలి' ప్రియుడి ఇంటి ముందు ధర్నా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.