RAIN EFFECT: 'చిన్న వానొస్తేనే.. వరదొస్తుంది.. ఆ తర్వాత డ్రైనేజీ పొంగుకొస్తోంది'

author img

By

Published : Sep 5, 2021, 4:37 PM IST

Updated : Sep 5, 2021, 5:01 PM IST

drainage problem at sai nagar colony

'చిన్న వర్షం పడిదంటే చాలు.. కాలనీ అంతా మురుగు నీటితో నిండిపోతోంది.. సుమారు రెండేళ్ల నుంచి ఈ సమస్య ఉంది.. ఆరు నెలల నుంచి ఈ సమస్య ఇంకా ఎక్కువైంది. ఎవరికి చెప్పినా.. చేస్తాం.. చూస్తం అంటున్నారు.. తప్ప.. సమస్య పరిష్కరించడం లేదు...' ఇది హైదరాబాద్​ మీర్​పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని జిల్లెలగూడ సాయినగర్​ కాలనీ వాసుల ఆవేదన.

RAIN EFFECT: 'చిన్న వానొస్తేనే.. వరదొస్తుంది.. ఆ తర్వాత డ్రైనేజీ పొంగుకొస్తోంది'

వానొచ్చిందంటే చాలు.. వరద సమస్య ఒకెత్తయితే.. డ్రైనేజీ సమస్య మరింత అవస్థలకు గురిచేస్తోందని మీర్​పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని జిల్లెలగూడ సాయినగర్​ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు.. డ్రైనేజీలో కలిసి కాలనీ అంతా దుర్గంధం వస్తోందని వాపోతున్నారు. సుమారు రెండేళ్ల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నామని.. ఎవరిని కలిసినా హమీలిస్తున్నారే తప్ప.. సమస్యలను పరిష్కరించడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు.

ఆరు నెలల క్రితం ఈ కాలనీలో డ్రైనేజీ మరమ్మతులు చేస్తామని చెప్పి.. ఎక్కడికక్కడ మట్టి తవ్వి వదిలేశారని.. అప్పటి నుంచి డ్రైనేజీ సమస్య మరింత ఎక్కువయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదని.. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఆరు నెలల నుంచి చాలా ఇబ్బందున్నది. రానికి.. పోనికి ఇబ్బందైతున్నది. డ్రైనేజీ సమస్యను త్వరగా పరిష్కరించాలి.

- రాజు, సాయినగర్​ కాలనీ

పెద్ద మోరీలు వేస్తామని చెప్పి.. ఆరు నెలల కింద తవ్వి వదిలేశారు. ఇంటి ముంగటే నీళ్లున్నాయి. ఇంటికి ఎవరూ రాకుండా అయిపోయింది. మేం ఎట్లా బతకాలి. - రజిత, సాయినగర్​ కాలనీ

గత రెండు సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఉంది. పట్టించుకునేవారే లేరు. అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదుచేశాం. కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదులు ఇచ్చాం. ఇవాళే మేయర్​తో మాట్లాడాం. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.

- అనిల్​గౌడ్​, సాయినగర్​ కాలనీ

చిన్న వర్షానికి కూడా డ్రైనేజీ పొంగుతోంది. బస్తీ వాసులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. చాలా మందికి ఫిర్యాదుచేసినా.. చర్యలు తీసుకోవడం లేదు. ఈ సమస్య ఎంతకాలం ఉంటుందో అర్థం కావడం లేదు.

- వీర్రాజు, సాయినగర్​ కాలనీ

ఇదీచూడండి: TS WEATHER REPORT: రాగల మూడ్రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.!

Last Updated :Sep 5, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.