ETV Bharat / state

Police Cought Thieves : జల్సాల కోసం యువతీ, యువకుడు చోరీల బాట.. పట్టించిన సీసీ కెమెరాలు

author img

By

Published : May 8, 2023, 4:39 PM IST

Updated : May 8, 2023, 4:56 PM IST

Etv Bharat
Etv Bharat

Police Caught Thieves in Medchal : కష్టపడి పనిచేసుకుంటున్న వృద్ధురాలి దగ్గర నుంచి పథకం ప్రకారం యువతీ, యువకుడు బంగారం దొంగిలించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి.. వారిని పట్టుకున్నారు.

Police Caught Thieves in Medchal : డిగ్రీ చేసి జాబు కోసం ప్రయత్నించే యువతీ, యువకులను చూసి ఉంటాం. సొంతంగా వ్యాపారం పెట్టుకుని అభివృద్ధి చెందే వారిని చూశాం. కాని ఓ యువతీ, యువకులు ఇద్దరు దానికి భిన్నంగా డబ్బుల కోసం చోరీ చేయడానికి వెనకాడలేదు. వారి ఇద్దరు ఒంటరిగా ఉన్న ఒక వృద్దురాలి మెడలో బంగారాన్ని దోచేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్​కి తరిలించారు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల బాపూజీనగర్​లో యాదమ్మ (55) టీస్టాల్ పెట్టుకుంది. దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఈ నెల 5వ తేదీన ఆమె దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు షాపులోని వస్తువులు కొనడానికి వచ్చారు. ఆమె వారు అడిగిన వస్తువులు ఇస్తుండగా.. నిందితులు వారితో తెచ్చుకున్న కారం పొడిని ఆమె కళ్లలో చల్లారు. దీంతో ఆమె కళ్లు కనిపించక అటు ఇటు తిరిగే లోపు.. వృద్ధురాలి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును నిందితులు లాక్కొని పారిపోయారు. కొంత సమయానికి ఆమె తేరుకుని స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. స్థానిక పోలీస్ స్టేషన్​లో యాదమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఘటన స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. ఆ వీధి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు.. వాటిని పరిశీలించారు. అందులో రికార్డు అయిన దృశ్యాలు ఆధారంగా.. ఉప్పల్​ బీరప్ప గడ్డకు చెందిన నరేష్​, మరొకరు అతని స్నేహితురాలిగా గుర్తించారు. వారిని బీరప్ప గడ్డ దగ్గర పట్టుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ జానకీ తెలిపారు. వారి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

వారి ఇద్దరు డిగ్రీ పూర్తి చేసుకున్నారని.. జల్సా జీవితాలకు అలవాటు పడడం వల్ల ఇలాంటి నేరాలు చేయడానికి వెనకాడ లేదని డీసీపీ అన్నారు. గతంలో వారిపై ఎటువంటి కేసులు లేవని పేర్కొన్నారు. ఒంటరిగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ఇలాంటి చోరీలు జరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉన్న ప్రదేశాల్లో మరింత జాగ్రత్త వహించాలని డీసీపీ చెప్పారు. ప్రజలు అందరూ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని.. పోలీస్​ నెంబరు 100 కి కాల్​ చెయ్యాలని అన్నారు.

"బాపుజీనగర్​లో టీ షాపు దగ్గరకి ఒక అబ్బాయి, అమ్మాయి స్కూటీ మీద వచ్చి అక్కడ ఉన్న యాదమ్మ మెడలో బంగారాన్ని పట్టుకుని పారిపోయారు. ఈ చోరీ జరిగిన గంట తరవాత మాకు సమాచారం అందింది. దీంతో చుట్టు పక్కల ఉన్న 72-80 సీసీ కెమెరాలను పరిశీలించగా.. నిందితులు ఇద్దరిని పట్టుకున్నాం. ఇదంతా 24 గంటలోపే చేశాం. నిందితులు ఇద్దరు ఉప్పల్​ బీరప్ప గడ్డకు చెందిన వారిగా గుర్తించాం."- జానకీ, మల్కాజిగిరి డీసీపీ

ఇవీ చదవండి:

Last Updated :May 8, 2023, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.