ETV Bharat / state

అధికారంలోకి వస్తే గిరిజన బంధు, పోడు భూముల పట్టాలు ఇస్తాం : హరీశ్​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 7:27 PM IST

Updated : Nov 11, 2023, 7:32 PM IST

Harish Rao on Telangana Development
Minister Harish Rao on Tribal Welfare in Telangana

Minister Harish Rao on Tribal Welfare in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 ఏళ్లు వెనక్కి పోతామని మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కేసీఆర్​ వారికి 10శాతం రిజర్వేషన్​ కల్పించారని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజన బంధు, పోడు భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Minister Harish Rao on Tribal Welfare in Telangana : కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే తెలంగాణ పదేళ్లు వెనక్కి పోతుందని మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనులకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. 2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్​ అధికారంలోకి (Congress) వస్తే తండాలని పంచాయతీలుగా మారుస్తామని చెప్పి.. మాట మార్చారని మండిపడ్డారు. కానీ వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందుకు గిరిజనులు తాగు నీరు లేకుండా ఇబ్బందులు పడ్డరోజులున్నాయని.. ఇప్పులు ప్రతి మారుమూల గ్రామానికి కూడా తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. హస్తం నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కనీసం తండాలకు రోడ్లు కూడా లేవని మండిపడ్డారు.

సమైక్యవాది పవన్‌ కల్యాణ్‌తో ఈటల రాజేందర్‌ ఎలా కలుస్తారు : మంత్రి హరీశ్​రావు

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రభుత్వం గిరిజనులకు 4 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్​ కళాశాలలను నిర్మించామని తెలిపారు. వారు విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్​లో స్కాలర్​షిప్​ ద్వారా ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల సహాయం అందిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సేవలాల్, కొమురం భీం జయంతి, సమ్మక్క-సారక్క పండుగలను అధికారికంగా బడ్జెట్​ కేటాయించి మరీ జరుపుతుందని చెప్పారు.

"కేసీఆర్​ ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా చేశారు. గిరిజన బిడ్డలకు 10శాతం రిజర్వేషన్​ కల్పించారు. 4లక్షల ఏకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజన బంధు, లక్ష ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తాం." - హరీశ్​రావు, బీఆర్​ఎస్ మంత్రి

Harish Rao on Telangana Development : తెలంగాణలో నిర్మిస్తున్న వైద్య కళాశాలు (Telangana Medical Colleges) గిరిజనులు ఎంతో సహాయపడుతున్నాయన్నారు. 2 లక్షల ర్యాంక్​ వచ్చినా.. వారికి వైద్య కళాశాలలో సీట్లు వచ్చాయని తెలిపారు. ఇది వరకు 2000 వేల ర్యాంకు వచ్చినా సీటు రాని పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజనులు వృద్ధి చెందాలని 10శాతం (Telangana ST Reservation) రిజర్వేషన్​ కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో దీని ద్వారా ఉన్నత చదువులు చదివి జీవితాల్లో స్థిరపడుతున్నారని తెలిపారు. ఈసారి అధికారంలోకి రాగానే గిరిజన బంధు (Girijana Bandhu) అమల్లోకి తెస్తామని.. బంజారా, కొమురం భీం భవనాలను అన్ని గ్రామాల్లో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన సుమారు లక్ష వరకు పోడు భూములను ఇస్తామని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ ఏ పథకం పెట్టినా మహిళల పేరుతోనే - వారికే పెద్ద పీట'

రేషన్​షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీని నమ్మితే మళ్లీ పదేళ్లు వెనక్కి పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఒకవైపు మాట తప్పే కాంగ్రెస్​ ఉంటే మరో వైపు మాటమీద నిలబడే కేసీఆర్ ఉన్నారని.. ఎవరు కావాలో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ వాళ్లకు టికెట్ కావాలంటే కర్ణాటక వాళ్లు కావాలి, ప్రచారం చేయాలంటే కర్ణాటక వాళ్లే కావాలి, డబ్బులు వాళ్లే ఇవ్వాలని హస్యస్పదంగా అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ వస్తే ఐటీ పరిశ్రమలన్నీ కర్ణాటక వెళ్తాయని ఆరోపించారు.

Minister Harish Rao on Tribal Welfare in Telangana అధికారంలోకి వస్తే గిరిజన బంధు పోడు భూముల పట్టాలు ఇస్తాం హరీశ్​రావు

'చట్టసభల్లోకి ఎరుకులను తీసుకెళతాం' ఎరుకుల ఆత్మ గౌరవ సభలో హరీశ్‌రావు

'భూమి కొరత వల్ల ఎస్సీలకు మూడెకరాలు ఇవ్వలేకపోయాం'

Last Updated :Nov 11, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.