ETV Bharat / state

కన్నకూతురిని వదలని నీచుడు.. బాలిక 5 నెలల గర్భవతి

author img

By

Published : Jun 17, 2020, 9:54 PM IST

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కడుపులో పెట్టుకుని రక్షించుకోవాల్సిన నాన్నే కామంతో గర్భవతిని చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే అందరినీ చంపేస్తానని బెదిరించటం వల్ల భయంతో ఐదు నెలల గర్భవతి అయింది ఆ బాలిక. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా సూరారంలో చోటుచేసుకుంది.

father raped his daughter in suraram
కన్నకూతురిపైన తండ్రి అఘాయిత్యం... బాలిక 5 నెలల గర్భవతి

కర్ణాటక నుంచి ఆరేళ్ల క్రితం వలస వచ్చి మేడ్చల్ జిల్లా సూరారం శివాలయం నగర్​లో భార్య, కూతురు, కొడుకుతో నివాసముంటున్నాడు రాజు. పెయింటర్​గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ తండ్రిలోని రాక్షసుడు బయటకు వచ్చాడు. 14ఏళ్ల కూతురిపై విరుచుకుపడ్డాడు. తండ్రి దుశ్చర్యను నివారించేందుకు ఆ బాలిక అరవగా... కాళ్లూ చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

విషయం ఇంట్లో వారికి చెప్తే అందరిని చంపేస్తానంటూ ఆ దుర్మార్ఘపు తండ్రి బెదిరించాడు. భయంతో బిక్కుబిక్కుమంటూ ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది ఆ బాలిక. లాక్​డౌన్ సమయంలోనూ బాలికను లొంగతీసుకున్నాడు కసాయి తండ్రి. బాలిక ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కాగా... విషయం తెలుసుకున్న స్థానికులు ఆ కామాంధునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.