ETV Bharat / state

Thinmar mallanna: తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు

author img

By

Published : Aug 4, 2021, 5:08 AM IST

Updated : Aug 4, 2021, 8:38 AM IST

తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులు హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్, ఇతర కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుుకున్నారు. తీన్మార్‌ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Thinmar mallanna
తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో మంగళవారం రాత్రి సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు అరగంట పాటు కంప్యూటర్లను తనిఖీ చేసి వెళ్లిపోయారు. హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌, ఇతర కంప్యూటర్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

యువతి ఫిర్యాదుతో తనిఖీలు

తీన్మార్‌ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. తీన్మార్‌ మల్లన్నతో పాటు అతని సోదరుడు పలువురి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నట్లు యువతి ఆరోపణలు చేసింది. వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు సదరు యువతి ఫిర్యాదు చేసింది. హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌లో పలువురి వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరి సమాచారం, ఎందుకు సేకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మల్లన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు వెల్లడించారు.

కార్యాలయం స్వల్ప ఉద్రిక్తత

తనిఖీల సమాచారం తెలుసుకున్న మల్లన్న అభిమానులు కార్యాలయం వద్దకు భారీగా చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సోదాల కోసం వచ్చిన వారిని అడ్డు కునే ప్రయత్నం చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు, అనుచరుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కొందరు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అనంతరం వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపైకి చేరి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ప్రశ్నించే గొంతుపై దాడి

క్యూ న్యూస్​ కార్యాలయంలో పోలీసుల సోదాలను భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ప్రశ్నించే గొంతును నొక్కేందుకే దాడి చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరుల అవినీతి, భూ కబ్జా ఆధారాలను మాయం చేసేందుకు మల్లన్న ఆఫీస్​ను సీజ్ చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రం లో సీఎం, తెరాస నేతలను మించిన అవినీతి పరులు లేరని, పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించాలని హెచ్చరించారు. సీఎం అవినీతిని ప్రశ్నించే వాళ్లను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని, తీన్మార్ మల్లన్నపై ఆరోపణలు వస్తే ముందుగా నోటీస్ ఇవ్వారా అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను మూయడం సీఎం తరం కాదని బండి సంజయ్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి:

KRMB: ఎల్లుండి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణాబోర్డు ప్రతినిధులు

Last Updated : Aug 4, 2021, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.