ETV Bharat / state

రాచకొండ పోలీసుల రక్తదాన శిబిరం.. 101 మంది ఔదార్యం..

author img

By

Published : Aug 10, 2020, 4:34 PM IST

ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్​స్టేషన్​ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని సీపీ మహేశ్​భగవత్ ప్రారంభించగా.. ఇప్పటివరకు 101 మంది దాతలు రక్తదానం చేశారు.

blood donation camp started by cp mahesh bhagavat
మేడిపల్లి పోలీస్​స్టేషన్​ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్​స్టేషన్​ వద్ద ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ప్రారంభించారు. కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు, తలసేమియా రోగుల ప్రాణాలు కాపాడేందుకు దాతలు చేసిన కృషికి సీపీ ప్రశంసించారు. ప్రతి దాత మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని సీపీ చెప్పారు.

blood donation camp started by cp mahesh bhagavat
రక్తదానం చేస్తున్న దాతలతో మాట్లాడుతున్న సీపీ

ఆపదలో ఉన్న వారిని అదుకోనేందుకు రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. రాబోయే రోజుల్లో తమ పరిధిలోని అన్ని పోలీస్​స్టేషన్లలో ఈ శిబిరాలు ప్రారంభిస్తామని సీపీ తెలిపారు. శిబిరాలను నిర్వహించినందుకు రెడ్​క్రాస్​కు చెందిన వైద్యుడు పిచ్చిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు 101 మంది దాతలు రక్తదానం చేశారని సీపీ వెల్లడించారు.

blood donation camp at medipally  police station
మేడిపల్లి పోలీస్​స్టేషన్​ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు

ఇదీ చదవండి: నిర్లక్ష్యమే నిప్పైంది...10 మంది ఉసురు తీసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.