Rain Effect on Paddy: వర్షాలతో అన్నదాతల కష్టాలు.. మొలకెత్తిన వరిధాన్యం

author img

By

Published : Nov 21, 2021, 10:37 PM IST

Rain Effect on Paddy, ramayam peta

ఆరుగాలం కష్టపడి పంట పండించినా కూడా రైతన్నకు కంటినిండా కునుకు కరువుతోంది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం అన్నదాతల పాలిట మరింత శాపంగా మారుతోంది. దీనికి తోడు వరుణుడు సైతం రైతన్నలపై పగబట్టడంతో దిక్కుతోచని స్థితిలో కర్షకులు మగ్గిపోతున్నారు. వర్షం దెబ్బకు వరిధాన్యం(Rain Effect on Paddy)మొత్తం మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏ కాలంలో అయినా ఒక్క రైతుకు మాత్రమే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎండకు, వానకు, చలికి తట్టుకుని పంటలు పండిస్తే చివరికి నడిరోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవాలంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఒకవైపు కొనుగోళ్లు నిలిచిపోవడం.. మరోవైపు వరుణుడి దెబ్బతో అన్నదాత బతుకు కకావికలమవుతోంది. అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కురిసిన వర్షాలకు వరిధాన్యం(rains effect on paddy) మొలకలు వచ్చాయని రైతన్నలు వాపోతున్నారు.

Rain Effect on Paddy, ramayam peta
మొలకెత్తిన ధాన్యంతో రైతులు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వాలు జాప్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా కొందరు రైతులు వరిని కోయక పోవడంతో పొలాల్లో పంట నేలకొరిగి పంట మొత్తం నేలమట్టం అయింది. పంట కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కనీసం 20 రోజులవుతున్నా తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొనుగోలు కేంద్రాలతో పాటు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో వర్షం దెబ్బకు మొలకలు(rains effect on farmers) రావడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.

Rain Effect on Paddy
వరి రైతులకు తప్పని కష్టాలు

మండలంలోని ఝాన్సీ, లింగాఫూర్‌కు చెందిన గుండా లక్ష్మీనారాయణ, భిక్షపతి, చాకలి లింగం, వడ్లవెంకట్, పంబల్ల బాబు, నీలగిరి అనే రైతులకు చెందిన వరిధాన్యం(paddy farmers in medak) పూర్తిగా మొలకలు వచ్చాయని వాపోయారు. అలాగే మండలం లోని రాయిలాపూర్, డి.ధర్మారం, ఆర్.వెంకటాపూర్, శివాయి పల్లి, సుతారిపల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని తొందరగా తూకం వేయాలని మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Rain Effect on Paddy, rains in medak
రోడ్డుపై మొలకెత్తిన వరిధాన్యాన్ని చూపుతున్న రైతు

ఇదీ చూడండి:

Paddy Procurement in Telangana: కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం.. కొనేదెప్పుడు?

RAIN: వర్షాలతో చెరువుల్లా మారిన కొనుగోలు కేంద్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.